Devara : దేవ‌రకు త‌ల‌నొప్పిగా మారిన ఫ్యాన్స్‌.. చిత్ర బృందం కీల‌క నిర్ణ‌యం..!

టాలీవుడ్‌లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్‌లో తారక్ తర్వాతే ఎవరైనా.. ఐతే ఇప్పుడు అదే ఫ్యాన్స్ తారక్‌కు పెద్ద తలనొప్పిగా మారారట.

Devara Team Sensational Decision

Devara Team Sensational Decision : టాలీవుడ్‌లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR).. నందమూరి నట వారసత్వమే కాదు.. సూపర్‌హిట్ మూవీలతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు తారక్.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్‌లో తారక్ తర్వాతే ఎవరైనా.. ఐతే ఇప్పుడు అదే ఫ్యాన్స్ తారక్‌కు పెద్ద తలనొప్పిగా మారారట.. ఫ్యాన్స్ అభిమానం మరీ ఎక్కువైపోవడంతో తారక్ కొత్త సినిమా దేవర(Devara)కు బ్రేక్‌లు పడుతున్నాయట.. ఇంతకీ ఫ్యాన్స్‌ నుంచి దేవరకు ఎదురవుతున్న కష్టమేంటో ఒక్కసారి చూద్దాం..

Nithiin 32 : నితిన్-వక్కంతం వంశీ సినిమా క్రేజీ అప్‌డేట్‌.. ఫ‌స్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్‌

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన దగ్గర నుంచి.. ప్రతి అప్టేడ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుత చూపుతున్నారు. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ప్ పై దేవర సినిమాపై చాలా హంగామా చేస్తున్నారు. ఒకానొక స్థాయిలో ఫ్యాన్స్ ఒత్తిడి తట్లుకోలేని ఎన్టీఆర్ వేరే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దేవర సినిమా అప్టేడ్స్ ఇచ్చాడు.

Vijai Bulganin : ‘బేబీ’ హిట్ అవుతుంద‌ని ఫ‌స్ట్‌ నుంచి నమ్మాను.. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్

ఇక ఇటివల సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఎన్టీఆర్ ఉన్న సీన్లు చిత్రీకరణ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమా యూనిట్ కు పెద్ద చిక్కే వచ్చి పడిందని చెబుతున్నారు. ఎక్కడ ఏం చేసినా, చేస్తున్న సినిమాకు సంబంధిచిన పిక్స్ క్షణాల్లో ఫ్యాన్స్ తమ సోషల్ అకౌంట్స్లో ముఖ్యంగా ట్విటర్ లో పెడుతున్నారు. ముందుగానే బయటకు వచ్చేస్తుంటే యూనిట్ కు ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి. ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక నిర్ణయం తీసుకుంది దేవరా టీం.. అదే ఇక సినిమాకు సంబంధించిన అన్ అఫిషియల్ ఫిక్స్ ఎవరైన లీక్ చేస్తే వాళ్ల సోషల్ మీడియా ఎకౌంట్ బ్లాక్ చెయ్యాలని, ఇది ఫ్యాన్స్ అయినా సరే. సినిమాకు సంబంధించిన అప్టేడేట్ అయిన, పిక్స్ అయిన అధికారికంగా పెడతామని అనవసరంగా లీక్ చేసి సినిమాకు ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నారు దేవరా టీం. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Bhagavanth Kesari Release date: బాల‌య్య అభిమానుల‌కు ఆ రోజు పూన‌కాలే.. భ‌గ‌వంత్ కేస‌రి రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ట్రెండింగ్ వార్తలు