Raj Tharun – Lavanya : లావణ్య కేసులో రాజ్ తరుణ్‌కి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. విచారణకు రావాలంటూ..

తాజాగా లావణ్య కేసు విషయంలో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు.

Lavanya

Raj Tharun – Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసు రోజుకొక మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లావణ్య.. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాలపై కేసు పెట్టగా పోలీసులు రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై కేసు నమోదు చేశారు. తాజాగా లావణ్య కేసు విషయంలో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు.

Also Read : Pawan Kalyan – RK Sagar : పవన్ కళ్యాణ్ ని కలిసిన మొగలిరేకులు RK సాగర్.. తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం..

నార్సింగ్ పోలీసులు BNSS 45 కింద రాజ్ తరుణ్ ని విచారణకు హాజరు కావాలని, ఈనెల 18వ తేదీన విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో లావణ్య నుంచి పూర్తి స్టేట్మెంటు రికార్డ్ చేసుకున్నారు. లావణ్య బయటకి వచ్చినప్పటినుంచి రాజా తరుణ్ ఒకేఒక్కసారి వచ్చి ఆమె చేసేవన్ని అబద్దపు ఆరోపణలు, మాకు బ్రేకప్ అయింది, లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది, అందుకే నేను ఆమెకు దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ నోటీసులపై రాజ్ తరుణ్ స్పందిస్తాడా, విచారణకు వస్తాడా చూడాలి.