Pawan Kalyan – RK Sagar : పవన్ కళ్యాణ్ ని కలిసిన మొగలిరేకులు RK సాగర్.. తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం..

మొగలిరేకులు RK సాగర్ జనసేన పార్టీలో చేరి తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Pawan Kalyan – RK Sagar : పవన్ కళ్యాణ్ ని కలిసిన మొగలిరేకులు RK సాగర్.. తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం..

Mogalirekulu Fame RK Sagar meets Janasena Pawan Kalyan in Mangalagiri

Updated On : July 16, 2024 / 10:19 AM IST

Pawan Kalyan – RK Sagar : మొగలిరేకులు సీరియల్ లో RK నాయుడు పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాలు చేసాడు. ప్రస్తుతం హీరోగా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇష్టంతో జనసేన పార్టీలో చేరి తెలంగాణ జనసేన ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Also Read : Kalki – Hanuman : 20 రోజుల ‘కల్కి’ సినిమా.. 50 రోజులు ఆడుతుందా..? ‘హనుమాన్’ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచి కొండగట్టుకు వచ్చినప్పుడు RK సాగర్ దగ్గరుండి అన్ని చూసుకున్నారు. సాగర్ చిరంజీవి కుటుంబానికి కూడా సన్నిహితులు అని తెలిసిందే. తాజాగా సాగర్ పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ లో కలిశారు. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడిన ఫోటోలు సాగర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయని తెలుస్తుంది.