Kalki – Hanuman : 20 రోజుల ‘కల్కి’ సినిమా.. 50 రోజులు ఆడుతుందా..? ‘హనుమాన్’ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

కల్కి సినిమా రిలీజయి నేటికి 20 రోజులు. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో చాలా థియేటర్స్ లో కల్కినే ఆడుతుంది.

Kalki – Hanuman : 20 రోజుల ‘కల్కి’ సినిమా.. 50 రోజులు ఆడుతుందా..? ‘హనుమాన్’ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?

Prabhas Kalki 2898AD Movie Targets Hanuman Movie Record in Theaters

Kalki – Hanuman : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898AD సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా.. లాంటి స్టార్ యాక్టర్స్ తో పారు ఎంతోమంది నటీనటులు, సెలబ్రిటీలని గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఓ విజువల్ వండర్ లా కల్కి సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసి పెద్ద హిట్ ఇచ్చారు. ఇక కలెక్షన్స్ పరంగా కేవలం 15 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతుంది.

అయితే కల్కి సినిమా రిలీజయి నేటికి 20 రోజులు. కల్కి సినిమాకు ఒక వారం రోజుల ముందు, ఒక వారం రోజుల తర్వాత ఏ సినిమాలు రిలీజ్ కి లేకపోవడం థియేటర్స్, కలక్షన్స్ విషయంలో కలిసొచ్చింది. రెండు వారాల తర్వాత కూడా వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఆడకపోవడంతో కల్కికి మరింత కలిసి వచ్చింది. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా చాలా థియేటర్స్ లో గరిష్టంగా కల్కి సినిమానే ఆడుతుంది.

Also Read : 1000 Crores Films : టాలీవుడ్ నుంచి 1000 కోట్లు సాధించినవి ఈ మూడు సినిమాలే.. ప్రభాస్ రికార్డ్ ఏ హీరో రీచ్ అవుతారు?

అయితే ఈ రోజుల్లో సినిమా సక్సెస్ ని కలెక్షన్స్ విషయంలోనే కొలుస్తున్నారు. కానీ ఒకప్పుడు థియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడిందో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు.. ఇలా సంవత్సరం పాటు చాలా థియేటర్స్ లో ఆడిన సినిమాల రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు థియేటర్స్ లో సినిమా వారం రోజులు, మహా అయితే రెండు వారాల కంటే ఎక్కువగా ఆడట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడింది.

హనుమాన్ సినిమా 300 సెంటర్స్ లో 30 రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 150 సెంటర్స్ లో 50 రోజులు ఆడి ఈ రోజుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. హనుమాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా ఏకంగా 350 కోట్లు సాధించి పెద్ద సక్సెస్ కొట్టింది. కల్కి ఆల్రెడీ హనుమాన్ సినిమాని కలెక్షన్స్ విషయంలో ఎప్పుడో దాటేసింది. దీంతో ఇప్పుడు థియేటర్స్ విషయంలో కల్కి సినిమా హనుమాన్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా అని ఆలోచిస్తున్నారు.

Also Read : Kiran Abbavaram Marriage : హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన హీరో..

కల్కి రిలీజయి నేటికీ 20 రోజులు. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో చాలా థియేటర్స్ లో కల్కినే ఆడుతుంది. మరి ఈ థియేట్రికల్ రన్ 50 రోజులు సాగుతుందా? 50 రోజులు ఎక్కువ థియేటర్స్ లో కల్కి ఆడుతుందా? హనుమాన్ రికార్డ్ బ్రేక్ చేస్తుందా చూడాలి. గత రెండు వారాలుగా సినిమాలేవీ లేకపోవడంతో కల్కి థియేటర్స్ లో ఆగింది. వచ్చే శుక్రవారం నుంచి ప్రతి వారం చిన్న, మీడియం సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. మరి రిలీజ్ సినిమాలని కాకుండా కల్కి కి థియేటర్స్ ఉంచుతారా, అసలు మూవీ యూనిట్ ఈ థియేటర్స్ రికార్డ్ ని ప్రకటిస్తుందా చూడాలి.