Kiran Abbavaram Marriage : హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన హీరో..

కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

Kiran Abbavaram Marriage : హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన హీరో..

Kiran Abbavaram talk about his Marriage with Actress Rahasya Gorak

Updated On : July 16, 2024 / 7:42 AM IST

Kiran Abbavaram Marriage : యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్న గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ‘క’ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ‘క’ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగ్గా మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం తన పెళ్లి గురించి కూడా మాట్లాడాడు.

కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజావారు రాణిగారు సినిమా చేస్తున్నప్పుడే ఆ సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరి ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడి ఐదేళ్లు రిలేషన్ మెయింటైన్ చేసి ఇటీవల మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు.

Also Read : Manorathangal : ఒకే సిరీస్‌లో కమల్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్.. ఇంకా చాలా మంది స్టార్స్.. ట్రైలర్ చూశారా?

తాజాగా ‘క’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నిశ్చితార్థం చేసుకున్నారు, పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అడగ్గా కిరణ్ సమాధానమిస్తూ.. వచ్చే నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలిపాడు. దీంతో కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ ఆగస్టులో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో కిరణ్ ఫ్యాన్స్ అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి కిరణ్ ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాడో చూడాలి.