Manorathangal : ఒకే సిరీస్‌లో కమల్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్.. ఇంకా చాలా మంది స్టార్స్.. ట్రైలర్ చూశారా?

తాజాగా మలయాళం, తమిళ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అందరూ కలిసి ఒకే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Manorathangal : ఒకే సిరీస్‌లో కమల్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్.. ఇంకా చాలా మంది స్టార్స్.. ట్రైలర్ చూశారా?

Kamal Haasan Mohanlal Mammootty Fahadh Faasil Manorathangal Web Series Trailer Released

Updated On : July 16, 2024 / 7:07 AM IST

Manorathangal Trailer : ఇటీవల చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ సినిమాల నుంచి వెబ్ సిరీస్ లలోకి కూడా వస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు వెబ్ సిరీస్ లతో మెప్పించారు. తాజాగా మలయాళం, తమిళ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అందరూ కలిసి ఒకే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. మలయాళం స్టార్ రైటర్ MT వాసుదేవర్ నాయర్ రాసిన కథతో జీ5 ఓటీటీలో ‘మనోరథంగల్’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు..

ఇది ఆంథాలజీ సిరీస్ గా 9 కథలని చూపించబోతున్నారు. ఈ సిరీస్ ని ఏకంగా 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్, పార్వతి తిరువొతు, బిజు మీనన్, నదియా, నెడుముడి వేణు, సురభి లక్ష్మి, అపర్ణ బాలమురళి.. ఇలా చాలామంది తమిళ్, మలయాళం నటీనటులు నటించారు. ఈ సిరీస్ రెండేళ్ల క్రితమే ప్రారంభమవ్వగా త్వరలో రిలీజ్ కాబోతుంది.

Also Read : Nabha Natesh : స్టేజిపై ఏడ్చేసిన నభా నటేష్.. యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకొని..

తాజాగా మనోరథంగల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఇంతమంది స్టార్ నటీనటులు ఒకే సిరీస్ లో ఉండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ మనోరథంగల్ వెబ్ సిరీస్ ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రం మళయాళంలోనే రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ మనోరథంగల్ ట్రైలర్ చూసేయండి..