Nabha Natesh : స్టేజిపై ఏడ్చేసిన నభా నటేష్.. యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకొని..

తాజాగా డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈవెంట్లో నభా నటేష్ మాట్లాడుతూ స్టేజిపై ఏడ్చేసింది.

Nabha Natesh : స్టేజిపై ఏడ్చేసిన నభా నటేష్.. యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకొని..

Nabha Natesh got Emotional while Speaking in Darling Movie Pre Release Event

Updated On : July 16, 2024 / 6:48 AM IST

Nabha Natesh : నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్.. లాంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇప్పుడు ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన డార్లింగ్ సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది.

తాజాగా డార్లింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నభా నటేష్ మాట్లాడుతూ స్టేజిపై ఏడ్చేసింది. నభా నటేష్ మొదట సినిమాకి పనిచేసిన వాళ్ళ గురించి, సినిమా గురించి మాట్లాడింది. అయితే తన యాక్సిడెంట్ డేస్ ని గుర్తు చేసుకుంటూ.. నేను చాలా టఫ్ టైంలో ఉన్నప్పుడు నాకు ఈ సినిమా వచ్చింది. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది. మా అమ్మ, నాన్న, తమ్ముడు.. వాళ్లంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా వాళ్ళు లేకపోతే నేనేమి చేసేదాన్ని కాదు. నాకు చాలా సపోర్ట్ చేసారు. థ్యాంక్యూ అంటూ స్టేజిపై ఏడ్చేసింది.

Also Read : Ram Charan : లండ‌న్ విమానం ఎక్కిన రామ్‌చ‌ర‌ణ్‌.. పెళ్లి నుంచి డైరెక్ట్‌గా..?

దీంతో నభా నటేష్ స్పీచ్ వైరల్ గా మారింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆల్మోస్ట్ తను ఫుల్ గా కోలుకోవడానికి ఒక సంవత్సరం పట్టిందని సమాచారం. ఆ సమయంలో తన ఫ్యామిలీనే దగ్గరుండి అన్ని చూసుకొని తను త్వరగా కోలుకునేలా చేసారని అందుకే ఇలా స్టేజిపై ఎమోషనల్ అవుతూ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పింది నభా నటేష్.