Ram Charan : లండ‌న్ విమానం ఎక్కిన రామ్‌చ‌ర‌ణ్‌.. పెళ్లి నుంచి డైరెక్ట్‌గా..?

రామ్‌చ‌ర‌ణ్ మాత్రం హైద‌రాబాద్‌కు రావ‌డం లేదు. విహార‌యాత్ర కోసం లండ‌న్ వెలుతున్నారు.

Ram Charan : లండ‌న్ విమానం ఎక్కిన రామ్‌చ‌ర‌ణ్‌.. పెళ్లి నుంచి డైరెక్ట్‌గా..?

Ram Charan off to London for family vacation after attending the Anant Radhika Wedding

Updated On : July 15, 2024 / 4:23 PM IST

Ram Charan : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ముంబైలోని జియో వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడ‌క‌కు టాలీవుడ్ మొద‌లు హాలీవుడ్ వ‌ర‌కు సెల‌బ్రిటీలు హాజ‌రయ్యారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న కూతురు క్లీంకార‌తో క‌లిసి అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్‌ల వివాహా వేడుక‌లో పాల్గొన్నారు. ఈ వేడుక ముగియ‌డంతో సెల‌బ్రిటీలు అంతా వారి వారి స్వ‌స్థ‌లాల‌కు చేరుకుంటున్నారు.

అయితే.. రామ్‌చ‌ర‌ణ్ మాత్రం హైద‌రాబాద్‌కు రావ‌డం లేదు. విహార‌యాత్ర కోసం లండ‌న్ వెలుతున్నారు. ఫ్యామిలీతో వెకేష‌న్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న చ‌ర‌ణ్.. పెళ్లి వేడుక ముగిసిన త‌రువాత ముంబై నుంచే త‌న కుటుంబంతో క‌లిసి లండ‌న్ విమానం ఎక్కారు. లండ‌న్‌లో చ‌ర‌ణ్ ఎన్ని రోజులు ఉంటార‌నే విష‌యాలు ఇంకా తెలియ‌రాలేదు.

Rakshit Shetty : క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత శెట్టిపై కేసు న‌మోదు..

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్ప‌టికే పూరైంది. త్వ‌ర‌లోనే బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో 16వ సినిమాగా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.

RC16 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న జాన్వీ కపూర్ న‌టిస్తోంది. శివ రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషించనున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత ద‌ర్శ‌కుడు.

Harish Sajja – Mahesh Babu : స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. మహేష్ కి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..