Harish Sajja – Mahesh Babu : స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. మహేష్ కి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూశారు. అమెరికాలో తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా నేడు ఉదయం హార్ట్ అటాక్ తో మరణించారు.

Harish Sajja – Mahesh Babu : స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. మహేష్ కి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..

USA Telugu Movies Star Distributor Harish Sajja Passed Away with Heart Attack

Updated On : July 15, 2024 / 10:40 AM IST

Harish Sajja – Mahesh Babu : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూశారు. అమెరికాలో తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా నేడు ఉదయం హార్ట్ అటాక్ తో మరణించారు. ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లిన హరీష్ సినిమాల మీద ఉన్న ఆసక్తితో, అమెరికాలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న డిమాండ్ చూసి అమెరికాలో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా మారారు.

2006 సంవత్సరంలో ఎన్టీఆర్ రాఖీ సినిమాతో అమెరికాలో హరీష్ సజ్జా డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఆ తర్వాత దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, రేసు గుర్రం, ఆగడు, 1 నేనొక్కడ్నే, జనతా గ్యారేజ్.. ఇలా చాలా సినిమాలు అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసారు. మహేష్ సినిమాలని తనే రిలీజ్ చెయడానికి ట్రై చేసేవాడు హరీష్ సజ్జా. మహేష్ బాబు కెరీర్ లో అమెరికాలో ఫస్ట్ 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమా దూకుడు. ఆ సినిమాని కూడా హరీష్ సజ్జానే అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మహేష్ బాబు దగ్గర్నుంచి షీల్డ్ కూడా అందుకున్నారు.

Also Read : Aditi Govitrikar : ‘తమ్ముడు’ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..

2016 వరకు దాదాపు పదేళ్లు అమెరికాలో తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగిన హరీష్ సజ్జా ఆ తర్వాత వయోభారంతో, పోటీ ఎక్కువవడంతో డిస్ట్రిబ్యూషన్ నుంచి తప్పుకున్నారు. తాజాగా నేడు ఉదయం అట్లాంటాలో నివసిస్తున్న ఆయన తన ఇంట్లోనే హార్ట్ అటాక్ వచ్చి మరణించారు. పలువురు డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.