1000 Crores Films : టాలీవుడ్ నుంచి 1000 కోట్లు సాధించినవి ఈ మూడు సినిమాలే.. ప్రభాస్ రికార్డ్ ఏ హీరో రీచ్ అవుతారు?

ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. స్టార్ హీరోలంతా 100 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ 1000 కోట్లు.

Tollywood 1000 Crores Films List and Which Upcoming Movies will Reach 1000 Crores

Tollywood 1000 Crores Films : ఒకప్పుడు సినిమా 100 కోట్ల కలెక్షన్స్ రాబడితే గొప్పగా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. స్టార్ హీరోలంతా 100 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ 1000 కోట్లు. బాహుబలి 2 సినిమాతో టాలీవుడ్ వాళ్ళు కూడా 1000 కోట్లు రాబడతారని చూపించారు. రాజమౌళి – ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పెద్ద హిట్ అవ్వడం, క్లైమాక్స్ లో పార్ట్ 2లో ఏం చూపిస్తారు అనే ఓ ఆసక్తి కలిపించడం, బాహుబలి 2ని భారీగా రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల పైనే సాధించింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు 1000 కోట్లు సాధించినా టాలీవుడ్ లో మళ్ళీ 1000 కోట్ల సినిమా రాజమౌళి ద్వారానే వచ్చింది. రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన RRR సినిమా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా ప్రభాస్ మళ్ళీ కల్కి 28998AD సినిమాతో ఇంకోసారి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసాడు. దీంతో టాలీవుడ్ లో ఇప్పటిదాకా 1000 కోట్లు సాధించిన సినిమాలుగా బాహుబలి 2, RRR, కల్కి 2898AD నిలిచాయి.

Also Read : Kiran Abbavaram Marriage : హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన హీరో..

ఇందులో రెండు సినిమాలు ప్రభాస్ వే కావడం గమనార్హం. RRR సినిమా రికార్డ్ మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి సాధించినా ఇద్దరి ఖాతాలో వేసేసుకున్నారు. మరి టాలీవుడ్ లో తర్వాత 1000 కోట్లు కొట్టే సినిమా ఏది, ప్రభాస్ రెండు సార్ల రికార్డ్ ని ఎవరైనా దాటిస్తారా అని చర్చగా మారింది. ప్రభాస్ నెక్ట్ సినిమాల్లో కూడా కల్కి పార్ట్ 2కి, స్పిరిట్ సినిమాలకు 1000 కోట్లు సాధించే ఛాన్స్ ఉంది. అయితే రాబోయే సినిమాలు దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాల్లో ఏదైనా 1000 కోట్లు సాధిస్తుందేమో, లేక మహేష్ బాబు – రాజమౌళి సినిమా మాత్రం 1000 కోట్లు కచ్చితంగా సాదిస్తుంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ 1000 కోట్ల రికార్డులో వేరే ఏ హీరో అయినా త్వరగా ఎంట్రీ ఇస్తాడా లేక మళ్ళీ ప్రభాసే సాధిస్తాడా చూడాలి.

ఇక దర్శకుల పరంగా చూస్తే రాజమౌళి రెండు సార్లు 1000 కోట్లు సాధించగా ఇప్పుడు కల్కితో నాగ్ అశ్విన్ 1000 కోట్లు సాధించాడు. మరి తర్వాత పుష్ప 2తో సుకుమార్ లేదా స్పిరిట్ తో సందీప్ వంగ 1000 కోట్లు సాధించే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదా మళ్ళీ రాజమౌళి మహేష్ బాబు సినిమాతో, నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2తో సాధిస్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు