Peka Medalu : 50 రూపాయలకే సినిమా చూడొచ్చు.. అది కూడా రిలీజ్‌కి ముందే..
పేకమేడలు సినిమా పెయిడ్ ప్రీమియర్ ని కేవలం 50 రూపాయలకే అందిస్తున్నారు.
- Saketh U
- Published On : July 16, 2024 / 01:43 PM IST
Vinoth Kishan Peka Medalu Movie Offers Ticket Rate 50 Rs for Paid Premiers
Peka Medalu : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినోద్ కిషన్ పేకమేడలు సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. నటుడు రాకేష్ వర్రే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో పేకమేడలు సినిమా తెరకెక్కింది. వినోద్ కిషన్ హీరోగా అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇప్పటికే పేకమేడలు సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి అంచనాలు నెలకొల్పారు. పనిపాట లేకుండా జీవితంలో పగటి కలలు కంటూ భార్య సంపాదన మీద బతికే ఓ వ్యక్తి జాబ్ లో జాయిన్ అయి అక్కడ ఒక అమ్మాయి పరిచయమయితే తన లైఫ్ ఎలా మారింది? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకొచ్చాయి అనే ఆసక్తికర కథని కామెడీ, ఎమోషనల్ గా చూపించబోతున్నారు.
Also See : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మా ఊరి జాతరలో.. మెలోడీ సాంగ్ రిలీజ్..
ఈ పేకమేడలు సినిమాకు ప్రమోషన్స్ కొత్తగా చేస్తున్నారు. ఈ సినిమా జులై 19న రిలీజ్ కాబోతుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్స్ 200 నుంచి 500 ఉన్న సమయంలో పేకమేడలు సినిమా పెయిడ్ ప్రీమియర్ ని కేవలం 50 రూపాయలకే అందిస్తున్నారు. నేడు, రేపు, ఎల్లుండి.. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ కి ముందే 50 రూపాయలకే పేకమేడలు సినిమా చూసేయండి. ఇప్పటికే కొన్ని ప్రీమియర్స్ మొత్తం సేల్ అయిపోయాయి కూడా.
