Bigg Boss Telugu Season 8 will Starts in 50 Days Rumours goes Viral
Bigg Boss 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ మళ్ళీ వచ్చేస్తుంది. తెలుగులో కూడా ఈ రియాల్టీ షో బాగానే సక్సెస్ అయింది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తిచేసుకోగా త్వరలో 8వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ అభిమానులు 8వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే, మరో 50 రోజుల్లోనే మొదలు కానుందని సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది.
సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి బిగ్బాస్ సీజన్ 8 మొదలవుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. యాంకర్ రీతూ చౌదరి, వేణుస్వామి, నయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, ఓ సెలబ్రిటీ కపుల్.. ఇలా పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమనేది షో మొదలయ్యేవరకు తెలీదు. అధికారికంగా బిగ్బాస్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read : Thaman : తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి కంటెస్టెంట్ ఎలిమినేట్.. లంచ్కి పిలిచిన తమన్..
ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇప్పటివరకు బిగ్బాస్ కి హోస్ట్ లుగా వ్యవహరించారు. గత అయిదు సీజన్ల నుంచి మాత్రం నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సారి ఎవరెవరు బిగ్బాస్ హౌస్ లోకి వస్తారో, ఎలాంటి టాస్కులు చేస్తారో, ఈ షోతో ఎంతమంది సెలబ్రిటీలుగా మారతారో చూడాలి. అయితే గత సీజన్ వివాదాల మయంగా నిలిచి సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.