Thaman : తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి కంటెస్టెంట్ ఎలిమినేట్.. లంచ్‌కి పిలిచిన తమన్..

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోఎలిమిలేషన్స్ మొదలయ్యాయి.

Thaman : తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి కంటెస్టెంట్ ఎలిమినేట్.. లంచ్‌కి పిలిచిన తమన్..

Aha Telugu Indian Idol Season 3 First Contestant Eliminated Thaman Invited for Lunch

Updated On : July 16, 2024 / 11:26 AM IST

Thaman – Telugu Indian Idol Season 3 : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలోఎలిమిలేషన్స్ మొదలయ్యాయి. మొదటి ఎలిమినేషన్ రౌండ్లో ముగ్గురు కంటెస్టెంట్స్ స్కంద, భరత్ రాజ్, కుశాల్ శర్మలు డేంజర్ జోన్‌లోకి రాగా చివరగా ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు వచ్చిన కుశాల్ ఎలిమినేట్ అయ్యాడు.

ఎలిమినేషన్ అనంతరం కుశాల్ మాట్లాడుతూ.. ఈ షో జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఈ వేదిక ఒక దేవాలయం, జడ్జీలు నా మార్గదర్శక వ్యక్తులు. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన తమన్, గీతా మాధురి, కార్తీక్‌ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపాడు. ఈ పోటీ నుంచి చాలా నేర్చుకున్నాను అని, విలువైన అనుభవాలు పొందాను అని అన్నాడు. కుశాల్ ఎలిమినేట్ ని కూడా పాజిటివ్ గా తీసుకున్నాడు.

Also Read : Chiranjeevi : సింగర్స్‌ని బెంగుళూరు ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లిన మెగాస్టార్.. వెళ్ళింది వెకేషన్‌కా? విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్‌కా?

కుశాల్‌కు వీడ్కోలు చెప్పేటప్పుడు తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. అయితే కుశాల్ ని తమన్ ఓదార్చి అతన్ని, కుశాల్ మదర్ ని ఇంటికి లంచ్ కి ఆహ్వానించాడు. దీంతో తమన్ ని అభినందిస్తున్నారు. ఇక 12 మందిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. ప్రతి వారం జడ్జీల మార్కులు, ప్రేక్షకుల వోటింగ్స్ ని బట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో ఈ షో కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.