Nicholai Sachdev : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన వరలక్ష్మి భర్త.. నేనే ఆమె పేరు పెట్టుకుంటాను..

తాజాగా కొత్త జంట వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలయ్ సచ్‌దేవ్ చెన్నైలో తమ పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా మీట్ నిర్వహించారు.

Varalaxmi Sarathkumar arranged Press Meet in Chennai with her Husband Nicholai Sachdev After Marriage

Nicholai Sachdev : వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్‌దేవ్ అనే ముంబైకి చెందిన ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. థాయిలాండ్ లో బీచ్ దగ్గర సింపుల్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోగా అన్ని సినీ పరిశ్రమల నుంచి అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వరలక్ష్మి – నికోలయ్ సచ్‌దేవ్ పెళ్లి ఫోటోలు ఇటీవల వైరల్ గా మారాయి.

తాజాగా కొత్త జంట వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్‌దేవ్ చెన్నైలో తమ పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటుడు, వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్‌దేవ్ మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Bigg Boss 8 : 50 రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 8 మొదలు.. ఎప్పట్నుంచి అంటే.. ఈసారి పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్..?

వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత వరలక్ష్మి పేరు మార్చుకుందాం అనుకుంది. శరత్ కుమార్ పేరుని అలాగే ఉంచి వరలక్ష్మి శరత్ కుమార్ సచ్‌దేవ్ గా మార్చుకుందాం అనుకుంది. కానీ నాకు అలా ఇష్టం లేదు. తన పేరు వరలక్ష్మి శరత్ కుమార్ లాగే ఉండాలి. నేనే ఆమె పేరుని తీసుకుంటాను. నికోలయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్‌దేవ్ అని నేనే పేరు మార్చుకుంటాను. శరత్ కుమార్ గారి లెగసీ, నా వైఫ్ లెగసీ అలాగే కొనసాగాలి. మా వైఫ్ కి నేను సపోర్ట్ ఇస్తాను. తను ఇకపై కూడా సినిమాలు చేస్తుంది. మీ అందరూ తనపై ప్రేమని కురిపిస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్యూ. ఆమెకు ఫస్ట్ లవ్ సినిమాలే. సినిమాల తర్వాతే నేను. తన యాక్టింగ్ వేరే లెవల్. ఇన్నాళ్లు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు