Kangana Ranaut first look released from Raghava Lawrence Chandramukhi 2
Chandramukhi 2 : రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ‘చంద్రముఖి 2’. మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఒక నెల సమయమే ఉండడంతో ఇటీవలే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.
Nandi Awards : నంది అవార్డ్స్ ఇస్తే ఊరుకునేది లేదు.. హెచ్చరిస్తూ ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ నోట్ రిలీజ్..
ఈ క్రమంలోనే మొన్న మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కంగనా క్లాసికల్ లుక్ లో ఒంపుసొంపుల ఒలికిస్తూ పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది. ఈ చంద్రముఖికి భయపడాల్సిన ఆడియన్స్ ఈ లుక్ చూసి మెస్మరైజ్ అవ్వుతున్నారు. మరి ఆ చంద్రముఖిని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Naga Chaitanya : తండ్రికి తగ్గ తనయుడు.. అమ్మాయిల మధ్యలో యువ మన్మధుడు..
The beauty ✨ & the pose 😌 that effortlessly steals our attention! 🤩 Presenting the enviable, commanding & gorgeous 1st look of #KanganaRanaut as Chandramukhi 👑💃 from #Chandramukhi2 🗝️
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗
— Lyca Productions (@LycaProductions) August 5, 2023
కాగా 2005 లో రజినీకాంత్ హీరోగా, జ్యోతిక చంద్రముఖిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన చంద్రముఖి సినిమా ప్రతి ఒక్కర్ని భయపెట్టి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.