The Kashmir Files : ఈ సినిమాతో బాలీవుడ్ పాపాలని కడిగేశారు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కంగనా వ్యాఖ్యలు..

తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా ఓ వీడియో పోస్ట్ చేసింది, కంగనా ఈ వీడియోలో మాట్లాడుతూ.. ''‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించిన....

The Kashmir Files :  ఇటీవల మార్చ్ 11న రిలీజ్ అయిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమా రోజు రోజుకి మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధిస్తుంది. రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతూ కలెక్షన్లని కూడా రాబడుతుంది. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’. ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మించగా బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. కశ్మీర్ లో హిందువులపై, కాశ్మీర్ పండిట్లపై 1980-90 దశకంలో జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టిస్తోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన వారంతా థియేటర్లలోంచి కన్నీళ్లతో బయటకి వస్తున్నారు. నరేంద్ర మోడీ, అద్వానీతో సహా సెలబ్రిటీలు సైతం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని చూసి డైరెక్టర్, చిత్ర యూనిట్ లను అభినందిస్తున్నారు. సెలబ్రిటీలు ఈ సినిమా గురించి అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా ఓ వీడియో పోస్ట్ చేసింది.

The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకి అరుదైన గౌరవం..

తాజాగా ఈ సినిమా చూసిన కంగనా రనౌత్‌ సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కంగనా ఈ వీడియోలో మాట్లాడుతూ.. ”‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రితో పాటు నిర్మాతలకు, మూవీ టీంకు అభినందనలు. నిజాలని నిర్భయంగా ఈ సినిమాతో చెప్పారు. ఈ సినిమా చూసి దేశంలోని తుకడే గ్యాంగ్ భయపడుతున్నారు. బెంగాల్, కేరళలో జరుగుతున్న మారణహోమాలపై కూడా సినిమాలు రావాలి. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాతో బాలీవుడ్ పరిశ్రమ చేసిన పాపాలను కడిగేశారు. బాలీవుడ్ చేసిన పాపాలను ప్రక్షాళన చేశారు. ఈ సినిమాని చాలా గొప్పగా చూపించారు. పరిశ్రమలో ఎలుకల్లా దాక్కొన్న వారంతా బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ కూడా ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాకు మద్దతుగా నిలవాలి’’ అంటూ పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు