Kantara: కన్నడ హీరో రిషబ్ నటించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వయంగా డైరెక్ట్ చేయగా, పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో దైవత్వానికి సంబంధించిన అంశాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు.
Kantara : గవర్నమెంట్ ఎగ్జామ్‌లో కాంతారపై ప్రశ్న..
కేవలం కన్నడలోనే కాకుండా ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది. ఇక తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఔరా అనిపించింది.
Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?
ఇటీవల కాలంలో 100 రోజులు ఆడే సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది. అలాంటిది, ఓటీటీలో అందుబాటులో ఉన్నా, కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు విషయం కాదని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్గా నటించగా, కిషోర్, మానసి సుధీర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హొంబాలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిర్గందూర్ ప్రొడ్యూస్ చేశారు.