Cat Receiving Royalties : పిల్లికి రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు

ఓ పిల్లికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. ఎందకంటే..అది చేసే పని అటువంటి మరి. ఇంతకీ ఆ పిల్లి పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తుందంటే..

A Cat Receiving Royalties At A Police Station : పోలీసులు కనిపించినా..వారి విజిల్ వినిపించినా ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అయిపోతారు. లేదా పారిపోతారు. కానీ పోలీసుల్ని చూస్తే ఎలుకలకేం భయం..అందుకే తోక జాడించుకుంటే పోలీస్ స్టేషన్ లో తెగ తిరిగేస్తున్నాయి. దీంతో పోలీసులకు స్టేషన్ లో ఎలుకలు చుక్కలు చూపిస్తున్నాయి. స్టేషన్ లో ఎలుకల బాధ తగ్గించుకోవటానికి ఓ పిల్లిని తెచ్చి పెట్టారు. దీంతో పోలీసులకు ఎలుకల బాధ తప్పిందట. దీంతో దొంగలు..నేరగాళ్లను పట్టుకోవటంలో బిజి బిజీ అయిపోయారు.

కర్ణాటకలోని మైసూర్ నగరంలోని రూరల్‌ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం.దీంతో ఎలుకలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు