Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

కేరళ సోరీ సినిమాలాగానే కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఉంటాయిని కన్నడలో ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని అన్నారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.

Karnataka Election Results 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి ఘన విజయాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. దీంతో కర్ణాటకలోనే కాకుండా యావత్ భారతదేశమంతా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకు నాంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ గెలుపు పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతునే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుపు రిపీట్ అవుతుందని ఆశించే కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదన్నారు. కేరళ సోరీ సినిమా పొరుగు రాష్ట్రాల్లో ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని పేర్కొన్నారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటకపై ఓటర్లపై ప్రభావం చూపించటంతో పూర్తిగా విఫలమైందని అదే మాదిరిగా కన్నడ ఫలితాలు తెలంగాణలో జరగవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి చురకలు వేస్తు నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర ఫలితమే ఈ విజయం అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్ర కూడా కారణమని..పార్టీ కార్యకర్తల కృషి కూడా ఫలించిందన్నారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదని చెప్పారు.

అలాగే ఈ ఘన విషయం పట్ల కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి గురి అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఫలితం ఈ విజయం అన్నారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు. ఈ విజయం సోనియా, రాహుల్ గాంధీలకు అంకితం అని చెప్పారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ట్రెండింగ్ వార్తలు