Ketika Sharma : పవన్ కళ్యాణ్ గారి కోసమే సినిమా ఒప్పుకున్నా.. కానీ పవన్ గారితో ఒక్క సీన్ కూడా లేదు..

తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన నటించిన కేతిక శర్మ విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

Ketika Sharma said ok to BRO Movie only for Pawan kalyan

Ketika Sharma :  పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో'(BRO). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిచగా థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, 2 పాటలు రిలీజయి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక బ్రో సినిమా జులై 28న రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన కేతిక శర్మ విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

ఈ సమావేశంలో కేతిక మాట్లాడుతూ.. బ్రో సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమా అనే ఒప్పుకున్నాను. కాకపోతే సినిమాలో ఆయనతో నాకు ఒక్క కాంబినేషన్ సీన్ కూడా లేదు. కానీ ఆయనని కలిశాను. ఆయన సినిమాలో కలిసి నటించడం చాలా సంతోషం గా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందెప్పుడు నేను కలవలేదు. ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో మొదటిసారి డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడాలంటే కాస్త భయమేసింది. సాయి ధరమ్ తేజ్ కి చెప్తే నన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ కలవలేకపోయాను. కానీ ఆరోజు ఆయనతో మాట్లాడిన ఐదు నిమిషాలు మాత్రం గుర్తుండిపోతుంది అని తెలిపింది.

Naga Babu : బేబీ నిర్మాత SKN, దర్శకుడు సాయి రాజేష్ జనసేన కోసం ఎంతో పని చేశారు..

ఆల్రెడీ వైష్ణవ తేజ్ తో నటించాను. ఆ సినిమా రంగ రంగ వైభవంగా షూటింగ్ లో ఉన్నప్పుడే బ్రో సినిమా అవకాశం వచ్చింది. ఇందులో సాయిధరమ్ తేజ్ తో నటించాను. మళ్ళీ మెగా హీరోలతో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను అని తెలిపింది కేతిక.

ట్రెండింగ్ వార్తలు