Dhammika Niroshana : ఘోరం.. భార్యా పిల్లల ముందే శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య.. ఇంట్లోకి చొరబడి..
శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురైయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : July 17, 2024 / 02:38 PM IST
Dhammika Niroshana
Dhammika Niroshana : శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురైయ్యాడు. మంగళవారం రాత్రి అతడి ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు నిరోషన భార్యా పిల్లల ఎదుటే అతడిని కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ధమ్మిక నిరోషన గత కొన్నాళ్లుగా గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా.. మంగళవారం రాత్రి ఓ దుండగుడు అతడి ఇంట్లో చొరబడి మాజీ క్రికెటర్‌పై దాడి చేశాడు. అనంతరం అతడి కుటుంబం కళ్ల ముందే తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారు అయ్యాడు. తీవ్రంగా గాయపడిన ధమ్మిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియాకు హార్దిక్ భార్య నటాషా.. వీడియో వైరల్
ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
20 ఏళ్లకే..
2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టుకు ధమ్మిక నిరోషన కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండేళ్ల పాటు అండర్-19 స్థాయిలో టెస్టులు, వన్డేలు ఆడాడు. 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతో పాటు లిస్ట్ ఏ మ్యాచ్‌లను సైతం ఆడాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల 20 ఏళ్లకే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతడి మృతి పట్ల పలువురు క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.
బుమ్రాను దించేశాడు..! బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ చేస్తున్న బుడ్డోడిని చూశారా.. వీడియో వైరల్
