మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. అజిత్ ప‌వార్‌కు షాకిచ్చిన నేత‌లు..

లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ తరుణంలోనే నలుగురు నేతలు పార్టీకి రాజీనామా ..

Sharad Pawar and Ajit Pawar

Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి అధినేత అజిత్ పవార్ కు ఆ పార్టీ నేతలు బిగ్ షాకిచ్చారు. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు ఎన్సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను అజిత్ పవార్ కు పంపినట్లు తెలిసింది. వీరిలో ఎన్సీపీ పింప్రి చించ్వాడ్ యూనిట్ చీఫ్ అజిత్ గవానే, స్టూడెంట్స్ వింగ్ చీఫ్ యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ లు ఉన్నారు. వీరంతా శరద్ పవార్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరితోపాటు అజిత్ పవార్ శిబిరంలోని మరికొందరు నేతలు శరత్ పవార్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

Also Read : కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్.. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని.. 

లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ తరుణంలోనే నలుగురు నేతలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. మరికొందరు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. అయితే, వీరంతా శరద్ పవార్ చెంతకు చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో శరత్ పవార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీని బలహీనపర్చాలనుకునే వారిని తమ పార్టీలోకి ఆహ్వానించమని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీయకుండా, పార్టీ బలోపేతానికి కృషిచేసే నాయకులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు.

Also Read : బుమ్రాను దించేశాడు..! బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ చేస్తున్న బుడ్డోడిని చూశారా.. వీడియో వైరల్

2023లో అజిత్ పవార్ ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పై తిరుగుబాటు చేశాడు. ఫలితంగా ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా చేరారు. దీంతో పవార్ కుటుంబం రెండు రాజకీయ పార్టీలుగా విడిపోయింది. శరద్ పవార్ ప్రతిపక్ష శిబిరంలో ఉండగా, అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో చేరారు. ఆ సమయంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అజిత్ క్యాంపులో చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే, లోక్ సభ ఎన్నికల తరువాత సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇప్పటి నలుగురు అజిత్ పవార్ వర్గంను వీడగా.. అదేబాటలో మరికొందరు అజిత్ పవార్ ను వీడి తిరిగి శరత్ పవార్ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు