Ram Pothineni : యూట్యూబ్ రాకముందే హీరో రామ్ షార్ట్ ఫిలిం తీసాడని తెలుసా? కానీ రామ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే..

షార్ట్ ఫిలిమ్స్ గురించి తెలియనప్పుడే, ఇంకా యూట్యూబ్ కూడా రాకముందే రామ్ షార్ట్ ఫిలిం తీసాడు.

Do you Know Her Ram Pothineni Acted in a Short Film before You tube comes

Ram Pothineni : యూట్యూబ్ 2005లో రాగా ఆ తర్వాత కొన్నాళ్ళకు షార్ట్ ఫిలిమ్స్ హవా బాగా నడిచింది. చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు. షార్ట్ ఫిలిమ్స్ లో సక్సెస్ అయి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే హీరో రామ్ కూడా ఒక షార్ట్ ఫిలిం తీసాడు. కానీ ఇండియాలో షార్ట్ ఫిలిమ్స్ గురించి తెలియనప్పుడే, ఇంకా యూట్యూబ్ కూడా రాకముందే రామ్ షార్ట్ ఫిలిం తీసాడు.

గతంలో రామ్ పోతినేని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అంటూ అందరూ చేస్తున్నారు కానీ నేను అసలు ఇక్కడ షార్ట్ ఫిలిం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే షార్ట్ ఫిలిం చేసాను. నేను 2000 – 2001లో ఒక షార్ట్ ఫిలిం చేశాను. అప్పటికి యూట్యూబ్ కూడా ఇంకా రాలేదు. మా ఫ్రెండ్స్ కి ఇలా షార్ట్ ఫిలిం చేశాను అంటే అవునా ఏం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగారు. అది థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమా కాదు 42 నిముషాలు చిన్న సినిమా చేశాను. అంటే మరి మిగతా సినిమా ఎప్పుడు చేస్తావు అని అడిగారు. వాళ్లకు షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ కూడా తెలీదు. అది రిలీజ్ అవ్వదు అవార్డు ఫంక్షన్స్ కి పంపించడానికి అంటే ఇంకెందుకు మరి మీరే తీసి మీరే చూసుకోడానికా అనేవాళ్లు. దీంతో నేను అసలు షార్ట్ ఫిలిమ్స్ తీసాను అని కూడా అప్పట్లో చెప్పేవాడిని కాదు. చెప్తే మళ్ళీ షార్ట్ ఫిలిం అంటే ఏంటి అని అడుగుతారు అంటూ తెలిపాడు.

Also Read : Aasheekaa Bathija : ‘కిక్’ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందంటే?

దీంతో రామ్ షార్ట్ ఫిలింలో నటించాడా? అది కూడా యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ రాకముందే నటించాడా అని ఆశ్చర్యపోతున్నారు. రామ్ అప్పట్లో చెన్నైలో ఉండేవాడు. చెన్నైలోనే తమిళ్ లో ‘అడయాలాం’ అనే తమిళ్ షార్ట్ ఫిలింలో నటించాడు. రామ్ స్కూల్లో చదివే రోజుల్లో ఈ షార్ట్ ఫిలిం చేసాడు. ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో ఉంది. ఆ తర్వాత రామ్ 2006లో 18 ఏళ్లకే దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. మీరు కూడా రామ్ నటించిన షార్ట్ ఫిలిం చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు