Aasheekaa Bathija : ‘కిక్’ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందంటే?

ముంబైకి చెందిన ఆషికా బతిజా చదువుకునే సమయంలోనే కిక్ సినిమా చేసింది.

Aasheekaa Bathija : ‘కిక్’ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందంటే?

Kick Movie Ileana Sister Character Aasheekaa Bathija what she doing now

Updated On : July 17, 2024 / 7:55 AM IST

Aasheekaa Bathija : రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో కిక్ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా ఇలియానా చెల్లికా ఆషికా బతిజా నటించింది. సినిమాలో ఇలియానా చెల్లి పాత్రకి కూడా మంచి స్కోప్ ఉంది. అయితే ఆషికా బతిజా ఆ తర్వాత సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు. కిక్ కంటే ముందు ఆషికా బతిజా గయానా 1838 అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది.

Also Read : Virat Kohli – Chiranjeevi : కోహ్లీ చిరంజీవి అభిమానా? చిరు పాటలంటే పిచ్చి.. ఆసక్తికర విషయం చెప్పిన కోహ్లీ ఫ్రెండ్..

ముంబైకి చెందిన ఆషికా బతిజా చదువుకునే సమయంలోనే కిక్ సినిమా చేసింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చదువుపైనే దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆషికా బతిజా అమెరికాలో ఉంటుంది. పెళ్లి చేసుకొని ఒక పాపకి తల్లి కూడా అయింది. అమెరికాలో వుమెన్ సర్కిల్స్ అనే సంస్థ స్థాపించి వుమెన్ ఎంపవర్మెంట్, మెడిటేషన్ ఈవెంట్స్, వుమెన్స్ కోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఆషికా బతిజా సినిమాలు పూర్తిగా వదిలేసింది.

View this post on Instagram

A post shared by @aasheekaa

అప్పుడు కిక్ లో చదువుకునే సమయంలో కొంచెం సన్నగా చిన్న పిల్లలాగా ఉన్న ఆషికా బతిజా ఇప్పుడు తల్లి అయ్యాక మారిపోయింది. దీంతో కిక్ లో ఇలియానా చెల్లిగా చేసింది ఈమేనా అని ఆశ్చర్యపోతున్నారు.