×
Ad

Virat Kohli – Chiranjeevi : కోహ్లీ చిరంజీవి అభిమానా? చిరు పాటలంటే పిచ్చి.. ఆసక్తికర విషయం చెప్పిన కోహ్లీ ఫ్రెండ్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ కోహ్లీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

  • Published On : July 17, 2024 / 07:18 AM IST

Dwaraka Raviteja says Virat Kohli Love Megstar Chiranjeevi Songs and Dance for those Songs

Virat Kohli – Chiranjeevi : ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత స్టార్ ప్లేయర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియా టీమ్ కు ఎన్నో విజయాలు అందించాడు, కెప్టెన్ గా టీమ్ ని నడిపించాడు. ఇటీవల T20 వరల్డ్ కప్ తర్వాత T20 లకు రిటైర్మెంట్ కూడా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ గురించి ఏ ఆసక్తికర వార్త వచ్చినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా విరాట్ కోహ్లీ ఫ్రెండ్, తెలంగాణకు చెందిన క్రికెటర్ రవితేజ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

తెలంగాణకు చెందిన ద్వారక రవితేజ గతంలో అండర్ 15 సమయంలో కోహ్లీతో కలిసి ఆడాడు. కోహ్లీతో కలిసి ఒకే రూమ్ లో ఉండేవాడట. రవితేజ గతంలో డెక్కన్ ఛార్జర్స్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం HCAకు కోచ్ గా చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవితేజ కోహ్లీ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.

Also Read : Kalki 2898AD OTT : ప్ర‌భాస్ ‘క‌ల్కి’.. ఓటీటీలోకి ఎప్పుడంటే..?

రవితేజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను, కోహ్లీ కలిసి అండర్ 15 లో డొమెస్టిక్ క్రికెట్ ఆడాము. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అప్పుడు రోజూ చిరంజీవి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళం. కోహ్లీకి చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరు చిరు అని పిలుచుకునేవాళ్ళం సరదాగా. మాకు గ్యాప్ వచ్చాక ఆరేళ్ళ తర్వాత కలిస్తే కోహ్లీ చిరంజీవి ఎలా ఉన్నారు అని అడిగాడు అంటూ తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ కూడా మెగాస్టార్ కి అభిమానా? మెగాస్టార్ పాటలకు అభిమానా అని ఆశ్చర్యపోతున్నారు. అయినా మెగాస్టార్ కి ఎవరైనా అభిమాని అయిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.