Double Ismart : అప్పులు, ఫ్లాపులు.. పూరి జగన్నాద్ హిట్ కొట్టాల్సిందే.. డబల్ ఇస్మార్ట్ పరిస్థితి ఏంటి?
డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఎక్కడా చాన్స్ తీసుకోవడం లేదు పూరీ. పూరీనే కాదు రామ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన 100 పర్సెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరికీ డబల్ ఇస్మార్ట్ హిట్ చాలా అవసరం.
- Saketh U
- Published On : July 17, 2024 / 10:58 AM IST
Ram Pothineni and Puri Jaganadh wants hit with Double Ismart Movie
Double Ismart : రామ్, పూరీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. మరో నెల రోజుల్లో థియేటర్లోకొస్తున్న డబుల్ ఇస్మార్ట్ కి సంబందించి మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది టీమ్. ఇప్పటి వరకూ పెద్దగా బజ్ లేని ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ కాస్త ఊపు తెస్తే లేటెస్ట్ గా వచ్చిన ఈ మాస్ సాంగ్ దాన్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతోంది. రామ్, కావ్య థాపర్ జంటగా మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో మాస్ ని టార్గెట్ చేస్తూ రిలీజైన మార్ ముంత.. చోడ్ చింత.. ప్రజెంట్ మాస్ సాంగ్స్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది.
పూరీ జగన్ అంటే మాస్ కి కేరాఫ్ అడ్రస్. ఆ మాసిజంని రామ్ లో నెక్ట్స్ లెవల్ లో చూపిస్తున్నారు పూరీ. ఇస్మార్ట్ శంకర్ లో అదే మాస్ కి పడిపోయిన ఫ్యాన్స్ డబల్ ఇస్మార్ట్ లో డబల్ ఎంటర్టైన్మెంట్ ఫీలవ్వడం గ్యారంటీ అంటున్నారు పూరీ. అందుకే అదే రేంజ్ లో పాటల్ని కూడా ఊరమాస్ లెవల్లో పిక్చరైజ్ చేస్తున్నారు, అదే లెవల్లో ప్రజెంట్ చేస్తున్నారు.
Also Read : Sitara Ghattamaneni : బాలీవుడ్ హీరోయిన్ తో సితార పాప అప్పుడు.. ఇప్పుడు.. ఆరేళ్లలో ఎంత ఎదిగిపోయింది..
డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఎక్కడా చాన్స్ తీసుకోవడం లేదు పూరీ. పూరీనే కాదు రామ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన 100 పర్సెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇద్దరికీ డబల్ ఇస్మార్ట్ హిట్ చాలా అవసరం. లైగర్ తో పీకల్లోతు నష్టాల్లో ఉన్న పూరీని సేవ్ చెయ్యాలంటే డబల్ ఇస్మార్ట్ హిట్ అయ్యి తీరాలి. కెరీర్ కంటిన్యూ అవ్వాలన్నా, పూరీ ఇమేజ్ సస్టెయిన్ అవ్వాలన్నా, ఫ్లాపుల నుంచి బయటపడాలన్నా, అప్పులు తీరాలన్న అర్జెంట్ గా హిట్ అవసరం. మరో వైపు రామ్ కూడా తన బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులకి బ్రేక్ వెయ్యాలంటే ఈ సినిమా సక్సెస్ చేస్కోవాలి. అందుకే అటు రామ్, పూరీ డబల్ ఇస్మార్ట్ రిలీజ్ ఆగస్ట్ 15 అయినా నెలరోజుల ముందు నుంచే మ్యూజిక్ ప్రమోషన్లతో దుమ్మురేపేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్లు, పాటలు డబల్ ఇస్మార్ట్ కి, పూరీ కి, రామ్ కి ఎలా హెల్ప్ అవుతాయో చూడాలి.
అయితే డబల్ ఇస్మార్ట్ థియేట్రికల్ సేల్ మాత్రం బాగానే అయిందని సమాచారం. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు 60 కోట్లకు డబల్ ఇస్మార్ట్ తెలుగు థియేట్రికల్ రైట్స్ కొన్నారని తెలుస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న హీరో, డైరెక్టర్ మీద ఇంత పెట్టారు అంటే రిస్క్ చేస్తున్నట్టే. అయితే ఇస్మార్ట్ శంకర్ బజ్ తో డబల్ ఇస్మార్ట్ కి జనాలు వస్తారని ఆశిస్తున్నారు.
