Sitara Ghattamaneni : బాలీవుడ్ హీరోయిన్ తో సితార పాప అప్పుడు.. ఇప్పుడు.. ఆరేళ్లలో ఎంత ఎదిగిపోయింది..

తాజాగా సితార కియారా అద్వానీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.

Sitara Ghattamaneni : బాలీవుడ్ హీరోయిన్ తో సితార పాప అప్పుడు.. ఇప్పుడు.. ఆరేళ్లలో ఎంత ఎదిగిపోయింది..

Sitara Ghattamaneni Photo with Kiara Advani after Six Years Photos Goes Viral

Updated On : July 17, 2024 / 10:26 AM IST

Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది సితార. దీంతో సితార ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సితారకు 12 ఏళ్ళు కాగా అప్పుడే హీరోయిన్ లా ఎంత పెద్దది అయిపొయింది అంటూ సితార ఫోటోల కింద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా సితార కియారా అద్వానీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.

బాలీవుడ్ భామ కియారా అద్వానీ గతంలో మహేష్ బాబుతో 2018లో భరత్ అనే నేను సినిమాలో నటించింది. అప్పుడు షూటింగ్ టైంలో సితార కియారాతో ఫోటో దిగింది. అప్పటికి సితారకు ఆరేళ్ళు. ఆ ఫొటోలో చిన్నప్పుడు క్యూట్ గా ఉంది సితార. తాజాగా మళ్ళీ ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత కియారాతో ఫోటో దిగింది.

Also Read : Kim Kardashian : ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ భామ.. మన సాంప్రదాయంలో..

ఇటీవల మహేష్ ఫ్యామిలీ ముంబైలో జరిగిన అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్లారు. అక్కడికి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ కూడా వచ్చారు. దీంతో సితార పలువురు బాలీవుడ్ నటీనటులతో ఫోటోలు దిగింది. ఈ క్రమంలో కియారా అద్వానీ, తన భర్త సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి సితార ఫోటో దిగింది. దీంతో గతంలో కియారాతో దిగిన ఫోటో, ఇప్పుడు కియారాతో సితార దిగిన ఫోటో కంపేర్ చేస్తూ సితార ఆరేళ్లలో ఎంత ఎదిగిపోయింది అంటూ కామెంట్స్ చేస్తారు అభిమానులు, నెటిజన్లు.

Sitara Ghattamaneni Photo with Kiara Advani after Six Years Photos Goes Viral