Kim Kardashian : ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ భామ.. మన సాంప్రదాయంలో..

కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ నిన్న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ ని దర్శించారు.

Kim Kardashian : ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ భామ.. మన సాంప్రదాయంలో..

Kim Kardashian Visits ISKCON Temple and Offers Annadanam to Childrens

Updated On : July 17, 2024 / 9:58 AM IST

Kim Kardashian : ఇటీవల హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ అనంత్ అంబానీ పెళ్ళికి హాజరైన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఈ ఇద్దరు భామలు ఇండియాలోనే ఉన్నారు. అనంత్ అంబానీ పెళ్ళిలో కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ సందడి చేసిన వీడియోలు, ఫోటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ ఇద్దరు హాలీవుడ్ భామలు ఓ మంచి పనిచేసారు.

కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్ నిన్న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ ని దర్శించారు. అక్కడ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇస్కార్ చేసే అన్నదానంలో పాల్గొన్నారు. అక్కడ పిల్లలకు వారే స్వయంగా వడ్డించారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సుల్లో కనపడే ఈ హాలీవుడ్ భామలు టెంపుల్ లో పద్దతిగా కనిపించారు. దీంతో ఈ హాలీవుడ్ భామల పూజలు, అన్నదానం ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read : Ram Pothineni : యూట్యూబ్ రాకముందే హీరో రామ్ షార్ట్ ఫిలిం తీసాడని తెలుసా? కానీ రామ్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే..

ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం, పూజలు చేసిన ఫోటోలను కిమ్ కర్దాషియన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. టెంపుల్ లో ఇంత మంచి అనుభూతిని ఇచ్చినందుకు, ఆ చిన్న పిల్లని కలిసేలా చేసినందుకు థ్యాంక్యూ అని వీళ్ళని అక్కడికి తీసుకెళ్లిన వాళ్ళని ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్స్ హాలీవుడ్ హీరోయిన్ అయినా ఇండియన్ కల్చర్ ని గౌరవించి, ఇక్కడ టెంపుల్ ని దర్శించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంది అంటూ కిమ్ ని అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kim Kardashian (@kimkardashian)