Rangamarthanda: కృష్ణవంశీ మార్క్‌లో ‘రంగమార్తాండ’ టైటిల్ అనౌన్స్‌మెంట్.. !

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలంగా సరైన హిట్ లేక వెనకబడిపోయారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆయన సినిమాలు చేయలేకపోతున్నారని....

Rangamarthanda: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా కాలంగా సరైన హిట్ లేక వెనకబడిపోయారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆయన సినిమాలు చేయలేకపోతున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన సత్తా ఏమిటో మరోసారి ఇండస్ట్రీకి చూపించాలని గతకొద్ది రోజులుగా కష్టపడుతున్నారు. ఇక ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

Rangamarthanda: కృష్ణవంశీ కోసం మెగాస్టార్ గాత్ర దానం!

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కృష్ణవంశీ అఫీషియల్ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమాకు ముందునుండీ అనుకుంటున్నట్లుగానే రంగమార్తాండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ టైటిల్ ప్రెజెంటేషన్ వీడియోను చాలా క్రియేటివ్‌గా రిలీజ్ చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తనదైన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నీషియన్ల పేర్లను కూడా కృష్ణవంశీ ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో చూపించాడు.

Rangamarthanda : డ్యాన్స్ మాస్టర్‌గా ప్రకాష్‌రాజ్ భార్య.. కృష్ణవంశీ దర్శకత్వంలో…

ఈ సినిమా కోసం పద్మశ్రీ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ, పద్మభూషణ్ చిరంజీవిలతో పాటు పద్మ భూషణ్, పద్మవిభూషణ్ ఇళయరాజా, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా పనిచేశారని కృష్ణవంశీ తెలిపారు. మొత్తానికి ఈ సినిమాతో దర్శకుడు కృష్ణవంశీ చాలా గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి రంగమార్తాండ చిత్రం కృష్ణవంశీ కలను నిజం చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు