MAA Elections : ‘మా’ ఎలక్షన్స్ రేపే.. గెలుపెవరిది??

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి చాలా రసవత్తరంగా జరగనున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సారి 'మా' ప్రసిడెంట్

MAA Elections :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సారి చాలా రసవత్తరంగా జరగనున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఎలక్షన్స్ కోసం రెండు ప్యానెల్స్ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సారి ‘మా’ ప్రసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. వీరి తరపున రెండు ప్యానెల్స్ లో ఆర్టిస్టులు హోరాహోరీగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్యానెల్స్ రోజూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలు, ఫిర్యాదుల వరకు వెళ్లారు. దీంతో ఈ సారి ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ని మించిపోయాయి. టాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఈ ఎలక్షన్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఎలక్షన్స్ కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. రేపు ఉదయం జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో 10 గంటలకు ‘మా’ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆఖరి ఘడియల్లో రెండు ప్యానెల్స్ వారి వ్యూహాలు అమలుపరుస్తున్నారు. ఒక్కసారి వారిద్దరి బాలలు బలహీనతలు చూద్దాం..

Siddharth: సమంతపై ట్వీట్ కాదు.. సిద్ధార్థ్‌ క్లారిటీ.. కుక్కలతో పోలుస్తూ!

మంచు విష్ణు సీనియర్ యాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్లి వారి మద్దతు అడుగుతున్నాడు. స్టార్ హీరోలని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆర్టిస్టులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. మేనిఫెస్టోలో వరాలు కురిపించాడు. ‘మా’కి సొంత భవనం తన డబ్బులతో కట్టిస్తానని ప్రకటించాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే అంశాన్ని గట్టిగా సంధిస్తున్నారు. మరి అదెంత వరకు పేలుతుందో చూడాలి. ఇక మంచు విష్ణు ప్రెస్ మీట్ లో సొంత డబ్బా కొట్టుకోవడం మెగా ఫ్యామిలీని విమర్శించడం, ఇంటర్వ్యూలలో సరిగ్గా మాట్లాడకపోవడం, సోషల్ మీడియాలో విష్ణుపై జరుగుతున్న భారీ ట్రోలింగ్ ఇవన్నీ విష్ణుకి నెగిటివ్ గానే ఉన్నాయి. వాటితో పాటు ‘మా’లో ఇప్పటిదాకా ఎక్కువగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వాళ్ళే గెలవడం అనే అంశం విష్ణుని ఆలోచనల్లో పడేస్తుంది.

Chay Sam : పిల్లల కోసం ప్లాన్ చేసిన చై-సామ్.. కానీ??

ఇక ప్రకాష్ రాజ్ చాలా కూల్ గా మాట్లాడటం, విష్ణు కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించడం, ‘మా’కి సొంత భవనం కడతామని చెప్పడం, మేనిఫెస్టోలో గొప్పలకు పోకుండా నెరవేర్చగలం అనుకున్న హామీలనే పొందు పరచడం, సీనియర్ ఆర్టిస్ట్ గా అందరికి తెలియడం, అందరితో మంచిగా ఉండటం ఇవన్నీ కలిసి వస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మెగా ఫ్యామిలీ అండ ప్రకాష్ రాజ్ కి ఉండటం బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. నాగబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రకాష్ రాజ్ తరపున పని చేస్తున్నారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన వాళ్లే గెలవడం ప్రకాష్ రాజ్ కి అదనపు బలం. ప్రకాష్ రాజ్ అందరి ఆర్టిస్టుల దగ్గరికి నేరుగా వెళ్లి మాట్లాడకపోవడం, నాన్ లోకల్ అనే ముద్ర పడటం మైనస్ అని చెప్పొచ్చు.

మరి దాదాపు 1000 మంది సభ్యులున్న ‘మా’లో రేపు ఎలక్షన్ ఎలా జరుగుతుందో, ఎవరు గెలుస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు