Karnataka Farmer : రైతు ఇంటికి వచ్చిన బొలెరో వాహనం.. క్షమాపణలు చెప్పిన మహీంద్రా ప్రతినిధులు

మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఆయనకు జరిగిన అవమానంపై రియాక్ట్ అయ్యింది. నేరుగా ఆయన ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి అందించారు.

Mahindra Delivers Vehicle : మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానంపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఆయనకు జరిగిన అవమానంపై రియాక్ట్ అయ్యింది. నేరుగా ఆయన ఇంటికే బొలెరో పికప్ ట్రక్కును తీసుకెళ్లి అందించారు. షోరూంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానం పట్ల తాము చింతిస్తున్నామని, ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. తమ వాహనాన్ని స్వీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియచేయడం జరుగుతోందన్నారు. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ ట్వీట్ పై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. సంస్థ కుటుంబంలోకి రైతును ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ లో తెలిపారు.

Read More : All of Us Are Dead: నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతున్న మరో కొరియన్ సిరీస్!

కర్ణాటకలోని మహీంద్ర షోరూంలో రైతుకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు రైతు కెంపెగౌడ ఈనెల 21వ తేదీన తుమకూరులోని మహీంద్ర షోరూంకి వెళ్లారు. అయితే.. అతని వేషధారణ చూసి సెల్స్ మెన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కారు ధర రూ. 10 లక్షలు, నీ వద్ద రూ. 10 ఉన్నాయా ? అంటూ సేల్స్ మెన్స్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో కెంపెగౌడ.. సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన కెంపెగౌడ.. ఓ గంటలో రూ. 10 లక్షలు తీసుకొని వస్తానంటూ..వెళ్లిపోయాడు. అనుకున్నట్లుగానే..డబ్బుతో అక్కడకు చేరుకున్నాడు. అతనితో పాటు స్నేహితులు కూడా వచ్చారు. డబ్బులు చూసిన సిబ్బంది ఖంగుతిన్నారు. వెహికల్ డెలివరీ కావడానికి సమయం పడుతుందని, కనీసం నాలుగు రోజులు పట్టవచ్చన్నారు.

Read More : Tirumala Temple: శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి విశేష ఉత్స‌వాలు

అయితే.. తనను అవమానించిన సిబ్బంది తనకు క్షమాపణలు చెప్పాలని రైతు కెంపెగౌడ డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. సేల్స్ మెన్ తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. క్షణాల్లో వైరల్ గా మారాయి. రైతు పవర్ ఏంటో చూపించాడంటూ కామెంట్స్ చేశారు. మహీంద్రా కంపెనీపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. రైతును అవమానిస్తారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి మహీంద్రా యాజమాన్యం దిగి రావాల్సి వచ్చింది. స్వయంగా ఆనంద్ మహీంద్రా రంగంలోకి దిగారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

Read More : iPhone Face ID: ఫేస్ మాస్క్ ఉన్నా ఐఫోన్ ఫేస్ ఐడీ ఫీచర్ పనిచేయాలంటే..

అనుకున్నట్లుగానే.. షోరూం సిబ్బంది బొలెరో పికప్ ట్రక్కును కెంపెగౌడకు అందించారు. షోరూం సిబ్బంది వాళ్లంతట వాళ్లే వచ్చి వాహనాన్ని డెలివరీ చేశారని, ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను కోరుకున్న టైంకే వాహనం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యక్తుల మర్యాద కాపాడడం.. తమ ప్రధానమైన నైతిక విలువ అని, దీనికి ఎవరూ అతిక్రమించినా..వారిపై తక్షణమే చర్యలు ఉంటాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ ద్వారా తెలిపారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యలుపై చర్యలు తీసుకుంటామని మహీంద్రా ప్రతినిధులు తెలిపారు. మొత్తానికి రైతు కెంపెగౌడకు జరిగిన అవమాన ఘటనకు ఫుల్ స్టాప్ పడింది.

ట్రెండింగ్ వార్తలు