chandrababu naidu
Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్ లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి ఓటు వేశారు. ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్ కు ఓటర్లు తరలివచ్చారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబ సభ్యులతో ఓటర్లు కరచాలనం చేశారు. అందరికీ అభివాదం చేస్తూ పోలింగ్ బూత్ లోకి వెళ్లి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?
ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో సుపరిపాలనకు నాంది పలికేలా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా ఇవాళ పోలింగ్ జరుగుతోందని అన్నారు. పుంగనూరు, మాచర్లలో హింసపై ఈసీకి ఫిర్యాదు చేశామని, ఓటింగ్ కు ప్రజాచైతన్యం వెల్లివిరిసిందని అన్నారు. ఓటు ప్రజాస్వామ్యంగా గుర్తించారు. ఓటు మీతో పాటు మీ పిల్లల జీవితాలను మారుస్తుందని చంద్రబాబు నాయుడు ప్రజలకు సూచించారు.