AP Election 2024: ఏపీలో ముగిసిన పోలింగ్ సమయం.. ఈవీఎంలలో ప్రజల తీర్పు
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ గడువు సాయంత్రం 4 గంటలకే ముగిసింది.

AP Elections 2024
AP Election 2024 : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ గడువు ముగిసింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ గడువు సాయంత్రం 4 గంటలకే ముగిసింది.
LIVE NEWS & UPDATES
-
ఎవరూ ఆందోళన చందాల్సిన పని లేదు: ముకేశ్ కుమార్ మీనా
ఎన్నికల సమయం ముగిసినప్పటికీ సాయంత్రం 6 గంటల కల్లా క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎవరూ ఆందోళన చందాల్సిన పని లేదని అన్నారు. ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
-
సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు సుమారు 67.99 శాతం మేర పోలింగ్ నమోదైంది.
ఏయే జిల్లాల్లో ఎంత శాతం?
- అల్లూరి 55.17
- అనకాపల్లి 65.97
- అనంతపురం 68.04
- అన్నమయ్య 67.63
- బాపట్ల 72.14
- చిత్తూరు 74.06
- కోనసీమ 73.55
- తూ.గో 67.93
- ఏలూరు 71.10
- గుంటూరు 65.58
- కాకినాడ 65.01
- కృష్ణా 73.53
- కర్నూలు 64.55
- నంద్యాల 71.43
- ఎన్టీఆర్ 67.44
- పల్నాడు 69.10
- పార్వతిపురం మన్యం 61.18
- ప్రకాశం 71
- నెల్లూరు 69.95
- సత్యసాయి 67.16
- శ్రీకాకుళం 67.48
- తిరుపతి 65.88
- విశాఖ 57.42
- విజయనగరం 68.16
- ప.గో 68.98
- కడప 72.85
-
కల్లూరులో ఉద్రిక్తత.. పోలీసుల అలర్ట్
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో కర్నూలు కల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివ నరసింహ రెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కుమారుడు శివ మధ్య వాగ్వాదానికి దిగారు. టీడీపీ బూత్ ఏజెంట్ వెంకటేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారన్న సమాచారంతో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు అలర్ట్ అయి వారందరినీ శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
-
కొట్టు సత్యనారాయణ తనయుడిపై దాడి
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పై జనసేన నాయకుడు పైబోయిన వెంకట్రామయ్య దాడి చేశారు. అలంపురం పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణపై జనసైనికులు కవ్వింపు చర్యలకు దిగారు. అక్కడితో ఆగకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన కొట్టు విశాల్ పై దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలు కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
-
మూడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ గడువు
మూడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ గడువు ముగిసింది. క్యూ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం
- అరకు.. 51.08
- పాడేరు.. 40.12
- రంపచోడవరం... 65.33
-
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌పై ఈసీ ఆగ్రహం
తనను ప్రశ్నించిన ఓటరు చెంప చెళ్లుమనిపించిన తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఈసీ ఆగ్రహం వ్యక్తి చేసింది. శివకుమార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని చెప్పింది.
-
3 గంటల వరకు ఓటింగ్ శాతం 55.49
ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున పోలైన ఓటింగ్ శాతం 55.49గా ఉంది. 4వ దశలో పోలింగ్ జరిగే అన్ని రాష్ట్రాల్లో మొత్తం ఓటింగ్ శాతం 52.60గా నమోదైంది.
-
నెల్లూరు జిల్లా అల్లూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట.
రామకృష్ణ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.
టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం.
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
-
గన్నవరం బాలుర హైస్కూల్ లో ఓటు హక్కు నియోగించుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఆయన సతీమణి పంకజశ్రీ.
-
మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం వివరాలు
- అనంతపురం అర్బన్ 42.27
- గుంతకల్లు 38.38
- కళ్యాణదుర్గం 27.57
- రాప్తాడు 41.30
- రాయదుర్గం 40.39
- శింగనమల 43.67
- తాడిపత్రి 40.01
- ఉరవకొండ 44.30
-
తొలి నాలుగు గంటల్లో ఏపీలో 25 శాతం పోలింగ్ నమోదు.
ఇప్పటి వరకు ఓటేసిన కోటికి పైగా ఓటర్లు.
25శాతం మేర మహిళల ఓటింగ్.
24.75 శాతం మేర పురుషుల ఓటింగ్.
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పోలింగ్ నమోదు.
అత్యల్పంగా పార్వతిపురం మన్యం జిల్లాలో పోలింగ్ నమోదు.అల్లూరి 18.61 శాతం
అనకాపల్లి 19.75 శాతం
అనంతపురం 27.30 శాతం
అన్నమయ్య 22.28 శాతం
బాపట్ల 26.88 శాతం
చిత్తూరు 25.81 శాతం
కోనసీమ 26.74 శాతం
తూ.గో 21.75 శాతం
ఏలూరు 24.28 శాతం
గుంటూరు 20.84 శాతం
కాకినాడ 21.26 శాతం
కృష్ణా 25.84 శాతం
కర్నూలు 22.05 శాతం
నంద్యాల 27.19 శాతం
ఎన్టీఆర్ 21.39 శాతం
పల్నాడు 23.25 శాతం
పార్వతిపురం మన్యం 15.40 శాతం
ప్రకాశం 28.14 శాతం
నెల్లూరు 23.77 శాతం
సత్యసాయి 20.61 శాతం
శ్రీకాకుళం 21.37 శాతం
తిరుపతి 22.66 శాతం
విశాఖ 20.47 శాతం
విజయనగరం 23.21 శాతం
పశ్చిమ గోదావరి 23.26 శాతం
కడప 27.02 శాతం
-
నంద్యాల జిల్లాలో మధ్యాహ్నం 12-00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 28.21
ఆళ్లగడ్డ. : 28.58 శాతం
బనగానపల్లి : 26.88 శాతం
డోన్ : 28.21 శాతం
నందికొట్కూర్ : 28.69 శాతం
నంద్యాల. : 28.66 శాతం
శ్రీశైలం. : 28.22 శాతం
-
కర్నూలు జిల్లాలో ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతం..
కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 21.86 శాతం
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 22.05 శాతం
కర్నూలు : 19.10 శాతం
పాణ్యం : 23.05 శాతం
పత్తికొండ : 21.80 శాతం
కోడుమూరు : 21.65 శాతం
ఎమ్మిగనూరు : 21.12 శాతం
మంత్రాలయం : 26.93 శాతం
ఆదోని : 20.48 శాతం
ఆలూరు : 23.05 శాతం
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దంపతులు
-
ఓటు వేసిన షర్మిళ
-
నంద్యాల జిల్లాలో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ 14.76 శాతం.
ఆళ్లగడ్డ. : 14.76 శాతం
బనగానపల్లి : 14.91 శాతం
డోన్ : 14.05 శాతం
నందికొట్కూర్ : 12.50 శాతం
నంద్యాల. : 17.12 శాతం
శ్రీశైలం. : 14.66 శాతం
-
ఓటు వేసిన కేఏ పాల్
విశాఖ జిల్లాలోని రైల్వే న్యూ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న కే. ఏ. పాల్ .
కేఏ పాల్ కామెంట్స్..
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.
యువత, మహిళల ఓటింగ్ శాతం పెరిగింది.
పోలింగ్ బూత్ లలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు.
ఓటర్లు చైతన్యవంతులు అయ్యారు.
-
ఏలూరు జిల్లా..
చింతలపూడి మండలం దేశవరంలో గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు.
దేశవరం దళిత కాలనీలో రోడ్లులేక నాలుగేళ్లుగా అవస్థలు.
ఎంతమంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా కలగని మోక్షం.
అంబులెన్స్ వచ్చినా పేషేంట్ లను ఎత్తుకుని ప్రధాన రహదారి వరకూ తీసుకెళ్లే దుస్థితి.
అసహనంతో ఓట్లు వేయమంటూ బహిష్కరించిన 200 మంది వరకూ ఓటర్లు ఉన్న దేశవరం ఎస్సి పేట కాలనీ వాసులు.
రోడ్డు గురించి అడిగితే మీరు ఓటు వేయకపోయినా పర్లేదని నాయకులు చెప్పారంటూ ఆగ్రహం.
-
ఓటు వేసిన బొత్స సత్యనారాయణ దంపతులు..
విజయనగరం ఎంఆర్ కళాశాల పోలింగ్ స్టేషన్ లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బొత్స కామెంట్స్ :
తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రతిపక్షాలు ప్రచారం చేయడం దారుణం.
హుందాగా నడుచుకోవాల్సిన ప్రతిపక్ష నేతలు ఇలా చౌకబారు ప్రచారం చేస్తారా.?
ఇలాంటి పరిస్థితులు తానెప్పుడూ చూడలేదు
-
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉదయం 9గంటల వరకు జరిగిన ఓటింగ్ శాతం వివరాలు
మొదటి రెండు గంటల్లో
విశాఖలో 10:24%
అనకాపల్లి 8:37%
అల్లూరి 6:77%నియోజకవర్గాల వారిగా
భీమిలి :7.91%
విశాఖ ఈస్ట్ :9.40%
విశాఖ వెస్ట్ :11.20%
విశాఖ సౌత్ :5.12%
విశాఖ నార్త్ :13%
గాజువాక :17.23%
పెందుర్తి:6.59%
అనకాపల్లి:11.60%
ఎలమంచిలి :6.91%
పాయకరావుపేట
నర్సీపట్నం:6.68%
చోడవరం :7.92%
మాడుగుల :11%
పాడేరు :5'60%
అరుకు:7%
-
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ అభ్యర్థి వై.ఎస్. షర్మిల ఇడుపులపాయలో ఓటు వేశారు. భర్త అనిల్ కుమార్ తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత. నలుగురికి గాయాలు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు.
-
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ చెదురుమదరు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో ఉదయం 9గంటల వరకు 12శాతం ఓటింగ్ నమోదైంది.
-
పిఠాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి వంగా గీత.
పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ హై స్కూల్ లో పోలింగ్ సరళిని పరిశీలించిన వంగా గీత.
144 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వంగా గీత, కుటుంబ సభ్యులు.
-
కడప, అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు....
రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలంలోని దాలవాయి పల్లిలో ఈవీఎం ధ్వంసం.
దాలవాయిపల్లిలో రీపోలింగ్ జరిగే అవకాశం.
వైసీపీ, టీడీపీ కార్యకర్తలు దాడులు. కార్లను ధ్వంసం.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని నక్కలదీన్నేలో టీడీపీ ఏజెంట్ ఉగ్రనరసింహులుపై దాడి.
గాయాలపాలైన ఏజెంట్ నరసింహులును ఆసుపత్రికి తరలింపు.
-
అనంతపురం జిల్లాలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ నమోదు శాతం..
అనంతపురం జిల్లాలో 9.18 శాతం పోలింగ్ నమోదు
శ్రీ సత్య సాయి జిల్లాలో 6.92 పోలింగ్ శాతం నమోదు
అత్యధికంగా అనంతపురం అర్బన్ లో ఇప్పటివరకు 12 శాతం ఓటింగ్ నమోదు
అత్యల్పంగా గుంతకల్లు 5శాతం ఓటింగ్ నమోదు
శ్రీ సత్య సాయి జిల్లాలో అత్యధికంగా హిందూపురంలో 6శాతం ఓటింగ్ నమోదు
అత్యల్పంగా మడకశిరలో 3శాతం ఓటింగ్ నమోదు
-
పోలింగ్ కేంద్రాలకు పెరుగుతున్న ఓటర్లు
ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తు వస్తున్న మహిళా ఓటర్లు,యువ ఓటర్లు
గతం కంటే అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం
గెలుపు ఓటమి నిర్ణయించేది మహిళ, యువ ఓటర్లే..
-
కృష్ణా జిల్లా గుడివాడలో ఓట్లు వేసేందుకు పోటెత్తిన ప్రజానీకం.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన క్యూ లైన్లు.
ఎక్కువసేపు నిల్చోలేక పోలింగ్ కేంద్రాల వద్ద కూర్చుండిపోతున్న వృద్ధులు.
పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు కుర్చునేందుకు సరైన వసతులు లేకపోవడంతో కింద కూర్చుంటున్న వృద్ధులు.
-
ఉదయం 9గంటలలోపు జరిగిన పోలింగ్ శాతం...
విశాఖ లో 9.5 శాతం పోలింగ్ నమోదు
అనకాపల్లి జిల్లాలో 10.25 శాతం నమోదు
అల్లూరి జిల్లాలో ..10.00 శాతం పోలింగ్..
-
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది.
ఉదయం 9-00గంటలకు 5.10శాతం పోలింగ్ నమోదైంది.
ఆళ్లగడ్డ. : 4.90శాతం
బనగానపల్లి : 5.32శాతం
డోన్ : 4.75శాతం
నందికొట్కూర్ : 4.29శాతం
నంద్యాల. : 5.22శాతం
శ్రీశైలం. : 6.21శాతం
-
ఓటు వేసిన పవన్..
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం లక్ష్మీ నరసింహ కాలనీలో బూత్ నంబర్ 197లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
-
వైఎస్ఆర్సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), తన కుటుంబ సభ్యులతో కలిసి తూర్పు నియోజకవర్గం, 29, 30 బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు
-
నంద్యాల..
నంద్యాల హరిజన పేటలో బూత్ నంబర్ 187 లో ప్రారంభం కానీ పోలింగ్ .
మొరాయిస్తున్న ఈవీఎంలు.
బారులు తీరిన ఓటర్లు.
ఆగిపోయిన పోలింగ్.
కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్న అధికారులు.
-
నెల్లూరు జిల్లా మర్రిపాడు జడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం 24వ నెంబర్ వద్ద ఈవీఎంల మొరాయింపు. ప్రారంభంకానీ ఓటింగ్ ప్రక్రియ.
పోలింగ్ నెంబర్ 3 వద్ద పోలీసులు భద్రత లేక ఓటర్ల తోపులాట. నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియ.
-
ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం : చంద్రబాబు
-
వైసీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి విజయసాయి రెడ్డి నెల్లూరులో క్షటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయ సాయిరెడ్డి కామెంట్స్ ..
పోలీసులపై విజయ్ సాయి రెడ్డి అసహనం.
పోలీసులను సక్రమంగా విధులు నిర్వహించడం లేదు.
ఓటర్లను సక్రమంగా క్యూలైన్లో పంపించడంలో విఫలం.
ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ బూత్ ల వద్ద పోలింగ్ బూత్ ల నెంబర్లు కూడా డిస్ ప్లే చేయలేక పోయారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన స్థాయిలో పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన విజయ్ సాయి రెడ్డి.
ఈసీగాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎన్నికల విధులకు సరిపడా సిబ్బందిని సమకూర్చలేదు.
సిబ్బంది లేనప్పుడు స్వచ్ఛంద సంస్థల నుంచి అయినా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆలోచించి ఓటు వేయాలని విజయ సాయిరెడ్డి అన్నారు.
-
ఉమ్మడి ప్రకాశం జిల్లా..
జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవిఎంలు.
మార్కాపురం పట్టణంలోని 66వ పోలింగ్ బూత్ లో మొరాయించిన ఈవీఎం.
లింగసముద్రం మండలం వాకములవారిపాలెం పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం.
చిన్నగంజాం మండలం సోపిరాలలో 272 వ బూత్ లో పనిచేయని ఈవీఎం.
యర్రగొండపాలెంలోని 33 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం.
పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం జడ్పీహెచ్ హైస్కూల్ లోని 78వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవిఎం.
త్రిపురాంతకం మండలం రాజుపాలెంలో 135 వ బూత్ లో మోరాయించిన ఈవీఎం
-
పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత. టీడీపీ -వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.
-
ఓటు వేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ..
-
ఉండవల్లిలో ఓటు వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి.
-
విజయవాడలో ఓటు వేసిన సీఈవో ఎం.కె.మీనా.
-
పులివెందుల భాకరాపురంలోని జయమ్మకాలనీ 138వ పోలింగ్ సెంటర్ వద్ద ఓటు వేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు.
అంతకుముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి అందరూ తప్పకుండా ఓటువేయాలని పిలుపునిస్తూ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు.నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 13, 2024
-
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పోలింగ్ కు అంతరాయం.
రాయదుర్గంలో రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా.
విద్యుత్ సరఫరా నిలిచిపోయి పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు.
బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం బయట నిలిచిన వాన నీరు.
-
తిరుపతి : ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు.
6.30 గంటలకు ఓటర్లను బూతులలోకి అనుమతించిన సిబ్బంది.
ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఓటర్ల క్యూ లైన్లు.
-
అన్నమయ్య జిల్లాలో మాక్ పోలింగ్ లో మొరాయించిన ఈవీఎంలు.
పీలేరు నియోజకవర్గ వాల్మీకిపురం మండలం జరావారిపల్లి పోలింగ్ బూత్ నెంబర్ 125లో ఘటన..
మోరాయించిన ఈవీఎంల స్థానంలో మరో వాటిని తెచ్చిన ఎన్నికల అధికారులు.
-
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎన్నికల అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ స్టేషన్ల వద్దకు మీడియా రాకుండా అడ్డుకుంటున్న పొలీసులు. ఎలక్షన్ కమిషన్ నుండి అథారిటీ లెటర్ పాస్ ఉన్నా.. తమకు సంబంధం లేదంటున్న ఎన్నికల అధికారులు.
-
- ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం...
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4:30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది.
పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది.
పురుషులు - 2,03,39,851
మహిళలు - 2,10,58,615
థర్డ్ జెండర్ - 3421
మొత్తం పోలింగ్ కేంద్రాలు - 46,389
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు - 12,438
వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు - 34651(74.7 శాతం)
వంద శాతం వెబ్ కాస్టింగ్ కేంద్రాలు - 14 నియోజకవర్గాలు. (అనకాపల్లి, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు,ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి , విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు , రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాలు.)
పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్ధులు - 454
అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్ధులు - 2387
పార్లమంట్ నియోజకవర్గాల్లో విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు బరిలో, అత్యల్పంగా రాజమండ్రిలో 12 మంది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతి నియోజకవరగ్ంలో 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరు గురు అభ్యర్దులు.
ఎన్నికల విధుల్లో సిబ్బంది - 5.26 లక్షల మంది
పోలీస్ సిబ్బంది - 1,06,000 మంది.