US Aquaculture : మంత్రి కేటీఆర్ అమెరికా టూర్.. పెట్టుబడులకు అమెరికా సంస్థల ఆసక్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద తన కార్యకలాపాలను ప్రారంభించనుంది ఫిష్ ఇన్ కంపెనీ. చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్...

Minister KTR America : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా సంస్థలు ముందుకొస్తున్నాయి. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్-పలు సంస్థలతో భేటి అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో జరిపిన సమావేశంలో ఫిష్‌ఇన్ సీఈవో మనీష్ కుమార్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ నిధులతో ‘ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం’ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని సీఈఓ తెలిపారు.

Read More : KTR US Tour: తెలంగాణ అభివృద్ధిని అమెరికాలో చాటిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద తన కార్యకలాపాలను ప్రారంభించనుంది ఫిష్ ఇన్ కంపెనీ. చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతుల విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగించనుంది. ప్రతియేటా 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read More : KTR: అమెరికాలో కేటీఆర్ కు ఘన స్వాగతం

ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్‌ఫ్లూయెంట్ మెడికల్ సంస్థ హైదరాబాద్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థ అధ్యక్షుడు, సీఈవో డీన్ షావర్‌తో కేటీఆర్‌ భేటి అయ్యారు. అనంతరం సీఈఓ సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు ప్రకటన చేశారు. త్వరలో పైలట్ ప్రాతిపదికన తయారీ యూనిట్‌ను మొదలెట్టి 12 నెలల్లో విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. దేశంలోనే ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీ కన్‌ఫ్లూయెంట్ మెడికల్ సంస్థ నిలవనుంది.

ట్రెండింగ్ వార్తలు