Puvvada Ajay Kumar: ఎవరెవరో వచ్చి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు.. షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Puvvada Ajay Kumar: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక కొందరు నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సీఎం కేసీఆర్ ను తిడుతున్నారు. కానీ, దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్లూరు బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 159 మెడికల్ కళాశాలలు దేశ వ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకి ఒక్క కళాశాల మంజూరు చేయలేదని అన్నారు. కానీ, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశారు. పిహెచ్‌సిలు ఏర్పాటు చేశారని అన్నారు.

Minister Harish Rao: కాంగ్రెస్, బీజేపీ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాయి.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం..

అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తాం అంటుండు, బండి సంజయ్ సచివాలయం కూల్చివేస్తామంటుండు. మరొకడు ప్రగతి భవన్ కూల్చుతాం అంటున్నారు. మరోవైపు షర్మిళ పోలీసు కానిస్టేబుల్‌ని కొట్టింది. కడప పోగరు చూపిస్తుంది. ఎక్కడఎక్కడ నుండో వచ్చి కేసీఆర్‌ని తూలనాడుతున్నారు అంటూ మంత్రి అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, దేశం ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటూ పువ్వాడ అజయ్ అన్నారు.

Bandi Sanjay : కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే : బండి సంజయ్

ఖమ్మం ప్రజలు చైతన్య వంతమైన ఆలోచన చేస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గెలుపు‌నకు నాంది పలకాలని అన్నారు. సత్తుపల్లికి 100 పడకలు, కల్లూరు, పెనుబల్లిలో 50 పడకల ఆసుపత్రి, వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చినందుకు హరీష్‌రావు‌కి మంత్రి అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు