Nagaland Burning : నాగాలాండ్‌లో కాల్పులు..పెరిగిన మృతుల సంఖ్య.. జవాన్లపై హత్యానేరం కేసు

నాగాలాండ్‌‌లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. మినీ ట్రక్‌లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారు జవాన్లు.

Nagaland Burning : నాగాలాండ్‌‌లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. మినీ ట్రక్‌లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారు జవాన్లు. ఈ కాల్పుల్లో 12 మంది అక్కడిక్కకడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పౌరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన అనంతరం ప్రజలు ఓ జవాన్‌పై దాడి చేయడంతో అతడు ప్రాణాలు విడిచాడు. దీనిపై విచారణ నిర్వహించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్.. ఉద్దేశపూర్వకంగానే జవాన్లు కాల్పులు జరిపినట్లు నిర్దారించారు.

చదవండి : Nagaland : నాగాలాండ్ థిరు గ్రామంలో ఫుల్ టెన్షన్

దీంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. హత్యానేరంతోపాటు భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కాల్పుల ఉదంతం తరువాత మోన్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కోహిమాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చారు. ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

చదవండి : Nagaland Firing : నాగాలాండ్ లో ఆర్మీ కాల్పులు..13 మందికి చేరిన మృతుల సంఖ్య

ఇక ఈ ఘటనపై లోక్‌సభలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సైన్యం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేతలు. ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయంత్రం 3 గంటలకు లోక్‌సభలో మాట్లాడనున్నారు.

ట్రెండింగ్ వార్తలు