Narendra Modi tweeted in Telugu: నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ జోరుగా జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ సాఫీగా జరుగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Also Read: నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ కల్యాణ్ గురించి ఏమన్నారంటే?
ఈ రోజు జరుగుతున్న 4వ దశ లోక్‌సభ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా ఈరోజు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది.
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి…
— Narendra Modi (@narendramodi) May 13, 2024
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024