CEC Gyanesh Kumar: వారి అనుమతి లేకుండా బయటపెట్టారు.. మీ బెదిరింపులకు ఈసీ భయపడదు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

CEC Gyanesh Kumar: "రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు" అన్నారు.

CEC Gyanesh Kumar: వారి అనుమతి లేకుండా బయటపెట్టారు.. మీ బెదిరింపులకు ఈసీ భయపడదు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్

CEC Gyanesh Kumar

Updated On : August 17, 2025 / 4:36 PM IST

CEC Gyanesh Kumar: ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి సమాధానమిచ్చారు.

రాహుల్ వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి అవమానం అని అన్నారు.

“మాకు అన్నిపార్టీలు సమానమే. ఏ పార్టీ మీదా పక్షపాతం లేదు. ఓటర్ లిస్టులో తేడాలు ఉంటే 15 రోజుల్లో మాకు రిపోర్ట్ చేయండి.

కొందరు నేతలు భ్రమలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు.

SIR ని సమస్యలు లేకుండా చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. కొందరు ఓటర్ల వివరాలు వారి అనుమతి లేకుండా బయటపెట్టారు. మీ బెదిరింపులకు ఈసీ భయపడదు.

రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు” అని జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) అన్నారు.

“భారత రాజ్యాంగం ప్రకారం, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కేవలం భారత పౌరులకే ఓటు హక్కు ఉంటుంది. ఇతర దేశాల వారికీ ఈ హక్కు ఉండదు.

ఇతర దేశాలకు చెందిన వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపితే, SIR (ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియలో వారు పౌరసత్వాన్ని రుజువు చేసే పత్రాలు సమర్పించాలి. పరిశీలనలో పౌరసత్వం రుజువు కాకపోతే, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు” అని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 1,300 కి.మీ ‘వోటర్ అధికార్ యాత్ర’ను బిహార్‌లోని ససారామ్ నుంచి ప్రారంభించారు.

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేతలు మద్దతు ఇస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా యాత్రలో పాల్గొన్నారు.

ALSO READ: Gold Reserves: మరోసారి జాక్‌పాట్.. భారత్‌లో 20 టన్నుల బంగారు గనుల గుర్తింపు