WhatsApp Web: ఆఫీస్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్‌లో వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? బీ కేర్ ఫుల్ అంటున్న కేంద్రం..
ఆఫీసు కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ ఉపయోగించడం వల్ల కలిగే భయానక పరిస్థితులు ఏంటో తెలుసా..(WhatsApp Web)

WhatsApp Web: ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆఫీస్ కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో WhatsApp వెబ్‌ను ఉపయోగించవద్దని చెప్పింది.
కార్పొరేట్ పరికరాల్లో WhatsApp వెబ్‌ను ఉపయోగించడం వల్ల చాట్‌లు, వ్యక్తిగత ఫైల్‌లు, లాగిన్ వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ సంస్థ హెచ్చరించింది.
‘సంస్థ పరికరాల్లో WhatsApp వెబ్‌ను ఉపయోగించడం సౌకర్యవంతంగా అనిపించవచ్చు, కానీ అది పెద్ద సైబర్ భద్రతా తప్పిదం’ అని వినియోగదారులను హెచ్చరిస్తూ ప్రభుత్వ సంస్థ ఒక వీడియోను కూడా విడుదల చేసింది.(WhatsApp Web)
”మీ చాట్‌లు, వ్యక్తిగత ఫైల్‌లు, లాగిన్ వివరాలు అడ్మిన్-స్థాయి యాక్సెస్, స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ లేదా మాల్వేర్ లేదా బ్రౌజర్ హైజాక్ అవొచ్చు” అని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ (ISEA) బృందం తెలిపింది.
ఉద్యోగుల పరికరాలను, వాట్సాప్ వెబ్‌ను పర్యవేక్షించే సంస్థలు మాల్వేర్, ఫిషింగ్ దాడులకు వెక్టర్‌గా మారొచ్చు. మొత్తం నెట్‌వర్క్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందంది.(WhatsApp Web)
ఆఫీసు కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ ఉపయోగించడం వల్ల కలిగే భయానక పరిస్థితులు:
డేటా ఉల్లంఘన: మీ ఆఫీస్ ల్యాప్‌టాప్ హ్యాక్ చేయబడితే, మీ వాట్సాప్ సంభాషణలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది, అందులో గోప్యమైన సమాచారం ఉండొచ్చు.
అసురక్షిత నెట్‌వర్క్‌లు: మీరు కార్యాలయంలోని పబ్లిక్ లేదా అసురక్షిత Wi-Fi నెట్‌వర్క్‌లో WhatsApp వెబ్‌ను ఉపయోగిస్తుంటే, మీ డేటాను అడ్డగించవచ్చు.
కంపెనీ యాక్సెస్: మీ యజమానికి పరికరం లేదా పర్యవేక్షణ సాఫ్ట్‌వేర్ యాక్సెస్ ఉంటే వారు మీ WhatsApp చాట్‌లను యాక్సెస్ చేయగలరు.
మీరు ఆఫీసులో వాట్సాప్ వెబ్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే, బయలుదేరే ముందు లాగౌట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా, తెలియని వారి నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అటాచ్‌మెంట్‌లను తెరవడం గురించి మరింత జాగ్రత్తగా ఉండండి.
అలాగే, పరికరాల వ్యక్తిగత వినియోగం, డేటా గోప్యతకు సంబంధించి మీ కంపెనీ విధానాలలు ఏంటో బాగా తెలుసుకోండి. (WhatsApp Web)
Also Read: మీ పిలల్లకు తేనే తినిపిస్తున్నారా? చేతులు, కాళ్ళు పడిపోవచ్చు.. జాగ్రత్త సుమీ