Raj Kundra: తీగలాగితే డొంకంతా కదిలింది. పోర్న్ వీడియోల నిర్మాణంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ బక్షి తో పాటు మరో 11 మందిని అరెస్ట్ చెయ్యడంతో పాటు రూ. 7.5 కోట్లను సీజ్ చేశారు. రాజ్ కుంద్రాకు జూలై 23 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Puneet Kaur : రాజ్ కుంద్రాపై పునీత్ కౌర్ ఆరోపణలు..
బ్రిటిష్ సిటిజెన్ ప్రదీప్ బక్షి, కుంద్రా సోదరిని వివాహం చేసుకున్నాడు. హాట్‌షాట్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అనే మొబైల్ యాప్ క్రియేట్ చేసిన కుంద్రా, బ్రిటన్‌లో బావ చేత కెన్రిన్ అనే మరో సంస్థ ఏర్పాటు చేశాడు. హాట్‌షాట్స్ అనేది ప్రపంచంలోనే 18+ వయసు వాళ్ల కోసం స్టార్ట్ చేసిన మొట్టమొదటి యాప్. ఈ యాప్‌లో మోడల్స్‌తో పాటు వరల్డ్ వైడ్ పాపులర్ యాక్ట్రెస్ హట్ పిక్స్, షార్ట్ ఫిల్మ్స్, హాట్ వీడియోలు అప్లోడ్ చేసేవాళ్లు.
Raj Kundra : రాజ్ కుంద్రాతో ఈ హీరోయిన్లకు లింకులు..!
ఈ యాప్‌కు ప్రపంచం వ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారట. ఈ అడల్ట్ కంటెంట్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా అండ్ టీమ్ రోజుకు రూ. 3 నుండి 4 లక్షల వరకు సంపాదించేవారట. లాక్డౌన్ సమయంలో యాప్‌కు మరింత ఆదరణ పెరగడంతో రోజుకి 7 నుండి 8 లక్షల ఆదాయం.. అంటే డబుల్ అయ్యింది. అని రాజ్ కుంద్రా విచారణలో పోలీసులతో చెప్పాడు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని బాలీవుడ్లో అలజడి స్టార్ట్ అయ్యింది.