Brahmanandam – Kovai Sarala : బ్రహ్మానందం కోవై సరళని ఏమని పిలుస్తాడో తెలుసా?.. అన్ని సినిమాల్లో భార్యాభర్తలుగా చేసి..

తాజాగా కోవై సరళ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా ఇందులో బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది.

Kovai Sarala Sharing Interesting Things about Brahmanandam

Brahmanandam – Kovai Sarala : బ్రహ్మానందం – కోవై సరళ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎక్కువగా భార్యాభర్తలుగా కూడా నటించారు. ఒకానొక సమయంలో ఏ సినిమాలో బ్రహ్మానందంకి పెయిర్ కావాలన్నా కోవై సరళనే తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరి పెయిర్ సూపర్ హిట్. ఆ పెయిర్ కి అభిమానులు కూడా ఉన్నారు. ఒకానొక సమయంలో సినిమాల గురించి అవగాహన లేని వాళ్ళైతే వాళ్ళు నిజంగానే భార్యాభర్తలేమో అనుకునేవారు. అంతలా బ్రహ్మానందం – కోవై సరళ తమ నటనతో ప్రేక్షకులని మెప్పించారు.

తాజాగా కోవై సరళ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొనగా ఇందులో బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది. కోవై సరళ మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారు నాకు అన్న, తండ్రిలా సలహాలిచ్చేవారు. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో ఎప్పుడైనా మాట్లాడితే.. సరళా చెల్లి ఏం చేస్తున్నావు, డబ్బులు దాచుకో, అవసరానికి పనికొస్తాయి. నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేనుంటాను అంటారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని తెలిపింది.

Also Read : Kovai Sarala – Kamal Haasan : కోవై సరళ కోసం 5 నెలలు వెయిట్ చేసిన కమల్ హాసన్.. ఆ సినిమాలో కమల్‌కి భార్య పాత్ర కోసం..

దీంతో కోవై సరళ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అన్ని సినిమాల్లో పెయిర్ గా చేసి బ్రహ్మానందం కోవై సరళను చెల్లి అని పిలవడం ఒక ఎత్తైతే, అలా పిలుస్తూ కూడా తెరపై ఇద్దరి మధ్య భార్యాభర్తలుగా మంచి కెమిస్ట్రీ పండించడం గ్రేట్ అని అభినందిస్తున్నారు.