×
Ad

Kovai Sarala – Kamal Haasan : కోవై సరళ కోసం 5 నెలలు వెయిట్ చేసిన కమల్ హాసన్.. ఆ సినిమాలో కమల్‌కి భార్య పాత్ర కోసం..

కమల్ హాసన్ అడిగి మరీ తన పక్కన హీరోయిన్ గా చేయించుకున్నారని తెలిపింది కోవై సరళ.

  • Published On : May 11, 2024 / 11:33 AM IST

Kovai Sarala Interesting Comments on Kamal Haasan

Kovai Sarala – Kamal Haasan : కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గతంలో హీరోయిన్ గా కూడా చేసి మెప్పించింది కోవై సరళ. ఎన్నో వందల సినిమాల్లో, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో నటించిన కోవై సరళ కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవై సరళ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న కోవై సరళ తన సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఈ క్రమంలో మాట్లాడుతూ కమల్ హాసన్ అడిగి మరీ తన పక్కన హీరోయిన్ గా చేయించుకున్నారని తెలిపింది. కోవై సరళ మాట్లాడుతూ.. ఓ రోజు కమల్ హాసన్ అసిస్టెంట్ ఫోన్ చేసి సతి లీలావతి సినిమాలో కమల్ హాసన్ పక్కన భార్యగా చేయాలని అడిగారు. కమల్ నా డేట్స్ కోసం చూస్తున్నారని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. కానీ అప్పుడు నేను తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను, డేట్స్ లేవు అని చెప్పాను. కమల్ నేను ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే చేద్దామని చెప్పారట. అలా నా డేట్స్ కోసం అయిదు నెలలు కమల్ హాసన్ వెయిట్ చేశారు. సినిమా షూటింగ్ అయ్యాక మీరు తప్ప ఇంకెవరూఈ పాత్ర ఇంత బాగా చేయలేరు అని అన్నారు కమల్ హాసన్ అని తెలిపింది.

Also Read : O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్’ టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..

బాలు మహేంద్ర దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో సతి లీలావతి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రమేష్ అరవింద్, కమల్ హాసన్, కోవై సరళ, కల్పనా, హీరా మెయిన్ లీడ్స్ లో చేశారు. ఇందులో కమల్ హాసన్ భార్యగా కోవై సరళ ఓ పల్లెటూరు అమ్మాయిగా నటించి ఫుల్ కామెడీతో నవ్వించింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా కమల్ హాసన్ నిర్మించారు. 1995లో సంక్రాంతికి ఈ సినిమా రిలీజయింది.