O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్’ టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..

తాజాగా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ టీజర్ రిలీజ్ చేసారు.

O Manchi Ghost : ‘ఓ మంచి ఘోస్ట్’ టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..

Nandita Swetha Vennela Kishore O Manchi Ghost Movie Teaser Released

Updated On : May 11, 2024 / 10:29 AM IST

O Manchi Ghost Teaser : ఇటీవల హారర్ కామెడీ సినిమాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ అనే హారర్ కామెడీ సినిమా రాబోతుంది. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని.. పలువురు ముఖ్య పాత్రల్లో శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ సినిమా నుంచి ఓ సాంగ్, కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ భయపెడుతూనే నవ్వించింది. ఈ సినిమాలో నందితా శ్వేతా ఘోస్ట్ గా నటించింది. టీజర్ లో.. పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే ఆసక్తికర డైలాగ్‌తో మొదలుపెట్టారు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ దయ్యలతో చేసే కామెడీ చూపించారు. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సినిమా. మరి త్వరలో థియేటర్స్ లో ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ఎలా భయపెడుతుందో చూడాలి.