AP Election Effect on Prabhas Kalki 2898AD Movie
Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) త్వరలో కల్కి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ కల్కి సినిమా జూన్ 27న రానుందని ఇటీవల ప్రకటించారు. ఇంకా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు వేయడానికి హైదరాబాద్ లో జాబ్స్ చేసే వాళ్ళు, ఇక్కడ నివసించే ఏపీ ప్రజలు అంతా ఏపీకి తరలి వెళ్తున్నారు.
ఈ ఎఫెక్ట్ కల్కి సినిమాపై పడింది. తాజాగా కల్కి నిర్మాత స్వప్న దత్ తన సోషల్ మీడియాలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫొటో షేర్ చేసి స్వప్న, నాగ్ అశ్విన్ మధ్య జరిగిన సంభాషణని రాసుకొచ్చింది. మన సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్ కి వెళ్లిపోయారు అని నాగ్ అశ్విన్ అంటే మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారేంటి అని స్వప్న అడిగింది. దీనికి నాగ్ అశ్విన్ ఎవరు గెలిస్తే నాకెందుకండి, నా సీజీ షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావలి కానీ అంటూ సమాధానమిచ్చినట్టు పోస్ట్ చేసింది స్వప్న.
Also Read : Sai Pallavi Birthday Celebrations : సాయి పల్లవి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ఓటు వేయడానికి వెళ్తుండటంతో ఆ ఎఫెక్ట్ కల్కి సినిమా మీద కూడా పడింది. కల్కి సినిమాకి ఇంకా గ్రాఫిక్ వర్క్ చాలా పెండింగ్ ఉందని, త్వరగా పూర్తిచేసి జూన్ 27 కి రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు వర్క్ ఆగిపోయినట్టు తెలుస్తుంది.