Chiranjeevi : చిరంజీవికి ఇష్టమైన పవన్, చరణ్ సినిమాలేంటో తెలుసా?

కిషన్ రెడ్డి చిరంజీవిని మీ ఇంట్లో అందరూ సినిమాలు చేస్తారు. మీ సినిమాల్లో కాకుండా మీ తమ్ముడు పవన్, తనయుడు చరణ్ సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టం అని అడిగారు.

Chiranjeevi says his favourite movies of Pawan Kalyan and Ram Charan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా బీజేపీ నేత, ఎంపీ కిషన్ రెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పొలిటికల్ అంశాలే కాకుండా సినిమాలు, లైఫ్ గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి చిరంజీవిని మీ ఇంట్లో అందరూ సినిమాలు చేస్తారు. మీ సినిమాల్లో కాకుండా మీ తమ్ముడు పవన్, తనయుడు చరణ్ సినిమాల్లో ఏ సినిమాలు ఇష్టం అని అడిగారు.

Also Read : ఎన్నికల ప్రచారంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

దీనికి చిరంజీవి సమాధానమిస్తూ.. పవన్ సినిమాల్లో తొలిప్రేమ అంటే బాగా ఇష్టం. ఆ తర్వాత బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇష్టం. ఇక చరణ్ సినిమాల్లో మగధీర అంటే ఇష్టం అని తెలిపారు. దానికి కిషన్ రెడ్డి.. అవును మగధీర రిలీజ్ అయినప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నారు. మా దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా చెప్పారు కూడా నా కొడుకు మగధీర సినిమా బాగా ఆడుతుందని, నాకు గుర్తుంది అని అన్నారు. దీంతో చిరు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.