Spirit Movie : ‘స్పిరిట్’ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ.. అప్పుడే 70 శాతం అయిపోయిందట..
ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం. అవి అయ్యాక సందీప్ వంగకి డేట్స్ ఇవ్వనున్నాడు.(Spirit Movie)

Spirit Movie
Spirit Movie : అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ అవ్వగానే సందీప్ కి డేట్స్ ఇవ్వనున్నాడు.(Spirit Movie)
ఈ సినిమా షూటింగ్ కొంతభాగం మెక్సికోలో చేస్తున్నామని, లొకేషన్స్ కూడా ఫైనల్ చేశాను అని కొన్ని రోజుల క్రితం సందీప్ వంగ చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా సందీప్ స్పిరిట్ గురించి మరో అప్డేట్ ఇచ్చాడు.
Also Read : Producer SKN : మరోసారి నిర్మాత SKN పెద్ద మనసు.. ఆ నటి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..
సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ కలిసి జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్టులుగా హాజరయ్యారు. ఈ షోలో జగపతి బాబు స్పిరిట్ గురించి అడిగారు.
సందీప్ మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమాకు 70 శాతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి అయిపోయింది. సాంగ్స్, మ్యూజిక్ అంతా ముందే ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. ఒక పెద్ద హీరో అని లేకుండా సింపుల్ గా కలిసిపోతాడు మనలో. ఈ సినిమా నిడివి మాత్రం మూడు గంటలు దాటదు. త్వరలోనే షూట్ మొదలవుతుంది. షూట్ మొదలయ్యాక ఇంకా ఆ సినిమా గురించి మాట్లాడతాను అని తెలిపాడు. దీంతో అప్పుడే మ్యూజిక్ వర్క్ అయిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారు. స్పిరిట్ సినిమాను వచ్చేసంవత్సరం మొదట్లోనే షూటింగ్ చేసి వచ్చే సంవత్సరమే రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.
Also Read : Sandeep Reddy Vanga : 5వ తరగతిలోనే సందీప్ రెడ్డి వంగ లవ్ స్టోరీ.. లీక్ చేసిన ఫ్రెండ్.. ఆ అమ్మాయి కోసం..