Producer SKN : మరోసారి నిర్మాత SKN పెద్ద మనసు.. ఆ నటి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో..
ఓ తెలుగు నటి తండ్రికి ఆరోగ్యం బాగోలేక సర్జరీ చేయాల్సి రావడంతో నిర్మాత SKN సాయం చేసారు. (Producer SKN)

Producer SKN
Producer SKN : నిర్మాత SKN వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. గతంలో సోషల్ మీడియా ద్వారానే అనేక మందికి హెల్ప్ చేసారు. జనసేన పార్టీ తరపున కూడా కొంతమందికి సపోర్ట్ చేసారు. తాజాగా నిర్మాత నిర్మాత SKN మరో సాయం చేసారు. అయితే ఈ సాయాన్ని నిర్మాత SKN బయటకు చెప్పుకోలేదు.
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, ఇండిపెండెంట్ సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి రేఖ భోజ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రేఖ. కొన్ని రోజుల క్రితం రేఖ భోజ్ తన తండ్రికి హెల్త్ బాగోలేదని, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ నిర్మాత SKN చూడటంతో ఆమె తండ్రి ఆరోగ్యం కోసం ఆర్ధిక సహాయం చేసారు.
Also Read : Sandeep Reddy Vanga : 5వ తరగతిలోనే సందీప్ రెడ్డి వంగ లవ్ స్టోరీ.. లీక్ చేసిన ఫ్రెండ్.. ఆ అమ్మాయి కోసం..
అయితే ఇది ప్రచారం చేసుకోవడం ఇష్టం లేక ఎవ్వరికి చెప్పుకోలేదు, తాను కూడా పోస్ట్ చేయలేదు నిర్మాత SKN. అయితే నటి రేఖ భోజ్ మాత్రం నిర్మాత SKN పేరు చెప్పకుండా.. మా నాన్నగారికి సర్జరీ అన్న పోస్ట్ చూసి, పరిచయం లేకున్నా, అడగకుండానే ఒక తెలుగు ప్రొడ్యూసర్ గారు పెద్ద సహాయాన్ని అందించారు. మీ హెల్ప్ నాకు చాలా చాలా విలువైనది సార్. చాలా థాంక్స్ అండి అంటూ కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసింది. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆ సహాయం నిర్మాత SKN చేసారని తెలిసింది దీంతో మరోసారి ఆయన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.