Allu Arjun : నంద్యాలలో భారీ జనసందోహం.. వైసీపీ నేత కోసం అల్లు అర్జున్ ప్రచారం..

వైసీపీ నేత శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడానికి నేడు నంద్యాల వెళ్లారు.

Allu Arjun and His Wife Participating in Election Campaign for Supporting YCP Leader Shilpa Ravi in Nandyal

Allu Arjun : దేశమంతా ఎన్నికల హీట్ నడుస్తుంది. ఇక ఏపీలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేడే ఎన్నికల ప్రచారంకు చివరి రోజు. దీంతో ఏపీలో అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక అన్ని పార్టీలు సెలబ్రిటీలను దించుతున్నారు. ఇప్పటికే అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు.

వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌వి చంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. శిల్ప రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడానికి నేడు నంద్యాల వెళ్లారు. నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్ప రవి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు.

Also Read : Kovai Sarala – Kamal Haasan : కోవై సరళ కోసం 5 నెలలు వెయిట్ చేసిన కమల్ హాసన్.. ఆ సినిమాలో కమల్‌కి భార్య పాత్ర కోసం..

నేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ కి మద్దతుగా అల్లు అర్జున్, భార్య స్నేహ రెడ్డి నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో నంద్యాల నుంచి అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ మామ పవన్ కళ్యాణ్ జనసేన పోటీలో ఉన్నా వైసీపీ నేతకు ప్రచారం చేస్తుండటంతో చర్చగా మారింది. ఇటీవల పవన్ కి మద్దతుగా బన్నీ ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే.