Kovai Sarala : ఓ పక్క నాన్న అంత్యక్రియలు.. మరో పక్క షూటింగ్.. ఎమోషనల్ అయిన కోవై సరళ..

కోవై సరళ తన తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Kovai Sarala get Emotional while speaking about her Father

Kovai Sarala : ఎన్నో వందల సినిమాల్లో, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గతంలో హీరోయిన్ గా చేసి మెప్పించింది కోవై సరళ. ఇటీవల కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కోవై సరళ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇటీవలే బాక్(అరణ్‌మనై 4) సినిమాలో నటించింది కోవై సరళ. తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొంది కోవై సరళ. ఈ ప్రోగ్రాంలో తన సినిమాలు, లైఫ్ గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also Read : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’కి ఎన్నికల ఎఫెక్ట్.. సీజీ వర్క్ చేసే వాళ్లంతా ఓటేయడానికి జంప్.. నిర్మాత పోస్ట్ వైరల్..

కోవై సరళ తన తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కోవై సరళ మాట్లాడుతూ.. మా నాన్న నేను సినిమాల్లోకి వెళ్తా అంటే సపోర్ట్ ఇచ్చారు. ఆయన మిలటరీలో చేసేవారు. నాతో ఫ్రెండ్ లా ఉండేవారు. ఫ్యామిలీ సినిమా షూటింగ్ కి ఊటీ వెళ్ళాలి. ఆ ముందు రోజు అర్ధరాత్రి మా నాన్న చనిపోయారు. ఆయన్ని వదిలి వెళ్ళలేను. కానీ నాన్న అంత్యక్రియలు అవ్వగానే షూటింగ్ కి వెళ్ళాను. మా నాన్న.. నీ కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా వృత్తిని గౌరవించాలి అని చెప్పేవారు. నాన్న చనిపోయిన బాధ ఉన్నా నా కోసం షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు అని షూటింగ్ కి వెళ్లి కామెడీ సాంగ్ లో నటించాను. నాన్న చనిపోయిన రోజే షూటింగ్ కి వెళ్లిపోవడంతో మా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అన్నారు, నాన్న చనిపోయినా పట్టించుకోకుండా డబ్బు కోసం వెళ్ళింది అని కామెంట్స్ చేసారు అని తెలుపుతూ ఎమోషనల్ అయింది.