Mumbai Rains: మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలతోపాటు ముంబై నగరంలోనూ సోమవారం సాయంత్రం ఆకస్మిక వర్షం కురుస్తోంది. ఉన్నట్లుండి నగరంలో వాతావరణం మారిపోవడంపై ముంబైకర్లు ఫన్నీ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది.
Mumbai: మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు.. ఐదున్నర కోట్ల విలువైన నగలు, కోటికిపైగా నగదు స్వాధీనం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రానికి ముందే వాతావరణం చల్లబడి, చీకటిగా మారిపోయింది. ఒక పక్క వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఈ వానలేంటా అని ముంబై వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముంబై వాతావరణం ఎప్పుడు, ఎలా ఉంటుందో ఊహించడం కష్టమంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ముంబై నగరం ఎప్పుడూ వాతావరణం విషయంలో సర్ప్రైజ్ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.
ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికగా ముంబై రెయిన్స్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి, తమ రెస్పాన్స్ వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫన్నీ మీమ్స్ ఇవి.
When you were waiting for mangoes in summer but God has different plans!#MumbaiRains #TheLastOfUs pic.twitter.com/kcu7auuUPH
— Prakriya Digital (@DigitalPrakriya) March 6, 2023
Mumbai weather is getting crazy!#mumbai #Weather pic.twitter.com/HCHOR3Qu8s
— nisarg1601? (@nisarg1601) March 5, 2023
#mumbai never fails to surprise you#Lightning #thunder #mumbaiweather pic.twitter.com/9ed8ubjfjh
— Anshuman Malhotra (@theanshumanm) March 5, 2023
So how is weather now in mumbai is it raining ?️? @fahmaankhan ? pic.twitter.com/S9ZtZth3Td
— Shireen? (@sheerinyerra) March 6, 2023